Donald Trump Apple iPhone Price Hike News : నాకు ఇండియా నుంచి ఐఫోన్ పంపించు.. అమెరికాలో ఉన్న వాళ్లు మనోళ్లకి ఫోన్లు..

Donald Trump Apple iPhone Price Hike News : నాకు ఇండియా నుంచి ఐఫోన్ పంపించు.. అమెరికాలో ఉన్న వాళ్లు మనోళ్లకి ఫోన్లు..

Donald Trump Apple iPhone Price Hike News : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న టారిఫ్ విధానాలు ఇప్పుడు ప్రజలకి చుక్కలు చూపించేలా ఉన్నాయి. ఈ సుంకాల ప్రభావంతో ఆపిల్ ఐఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు అంతర్జాతీయంగా పెద్ద మార్పులు తీసుకువస్తున్నాయి. ఇది కేవలం దేశాల మధ్య వ్యాపార పోటీకి పరిమితం కాకుండా, ప్రజల కొనుగోలు సామర్థ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

తాజాగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, అమెరికా ఇండియాపై టారిఫ్‌లు అమలు చేసే ముందు యాపిల్ ముందస్తు చర్యగా మూడు రోజుల్లో ఐదు కార్గో విమానాల్లో ఇండియా నుంచి ఐఫోన్లు మరియు ఇతర గ్యాడ్జెట్లను అమెరికాకు తరలించినట్లు తెలుస్తోంది. భారత్ ఇప్పటికే యాపిల్ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తున్న నేపథ్యంలో, అమెరికా కూడా ప్రతిస్పందనగా తగిన టారిఫ్‌లను విధించవచ్చని ట్రంప్ మునుపు నుంచే హెచ్చరిస్తున్నారు.

ఇండియాలో తయారైన ఐఫోన్లు అమెరికాకు ఎగుమతి చేసే సమయంలో సుంకాలు పెరిగితే, వాటి ధరలు కూడా పెంచాల్సి వస్తుంది. కాబట్టి సుంకాలు అమల్లోకి రాకముందే స్టాక్‌ను తరలించి, కొంతకాలం ప్రస్తుత ధరలకే అమ్మాలని యాపిల్ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇంతకు ముందు వరకు భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే ఐఫోన్లపై ఎటువంటి సుంకాలు లేవు. కానీ ఏప్రిల్ 5 నుంచి 10 శాతం టారిఫ్ అమల్లోకి వచ్చింది. అదే టారిఫ్ ఏప్రిల్ 9 తర్వాత 26 శాతానికి పెరగనుంది. దాంతో ఖచ్చితంగా ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి చివరిలోనే యాపిల్ సంస్థ తక్షణ చర్యగా ఇండియాలో తయారైన ఐఫోన్లు, ఇతర గ్యాడ్జెట్లు ఐదు విమానాల్లో అమెరికాకు తరలించినట్లు సమాచారం.

అమెరికాలో ట్రంప్ నిర్ణయించిన ఈ సుంక విధానం అక్కడ నివసిస్తున్న ఎన్ఆర్ఐలకు ఊహించని భారంగా మారే అవకాశం ఉంది. ఐఫోన్ల ధరలు భారీగా పెరిగే నేపథ్యంలో భారత్ నుంచే కొనుగోలు చేయడం ఉత్తమమైన ఎంపికగా మారుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికే యాపిల్ భారత్‌లో పెద్దఎత్తున అసెంబ్లింగ్ యూనిట్లు నెలకొల్పింది. చైనాతో పోలిస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై అమెరికా టారిఫ్ శాతం తక్కువగా ఉండటంతో, అమెరికాలో ఉన్న మనవాళ్లు భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యులను ఐఫోన్ కొని పంపించమని అడిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read : WHO Warns Another Pandemic: కోవిడ్‌ను మించిన ముప్పు.. మరో మహమ్మారి తప్పదని హెచ్చరిస్తున్న WHO!

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *