పరిచయం
అనుముల రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుతం మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు.
అనుముల రేవంత్ రెడ్డి జీవిత పరిచయం
పేరు | అనుముల రేవంత్ రెడ్డి |
జననం | 1969 నవంబరు 8 (వయసు 53) |
పుట్టిన ప్రదేశం | కొండారెడ్డిపల్లి గ్రామం , వంగూరు మండలం , నాగర్‌కర్నూల్ జిల్లా |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
జీవిత భాగస్వామి | గీత |
సంతానం | నైమిష |
వృత్తి | రాజకీయవేత్త, శాసనసభ సభ్యుడు |
నియోజకవర్గం | మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఎంపీ |
తండ్రి | అనుముల నరసింహ రెడ్డి |
విద్య | ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ |
తొలి రాజకీయ జీవితం
అనుముల రేవంత్ రెడ్డి గారు 2006లో మిడ్జిల్ మండలం జడ్పిటిసి సభ్యుడిగా విజయం సాధించి, 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్నగర్ జిల్లా నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుండి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ అభ్యర్థులు రావులపల్లి గుర్నాథ్ రెడ్డి పై విజయం సాధించారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రేవంత్ రెడ్డి గారు 2014 – 2017 మధ్య టిడిఎల్పి ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు. 2017 అక్టోబర్లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆయన 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 మే లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డిని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా జూన్ 26 2021లో జాతీయ కాంగ్రెస్ పార్టీ నియమించింది. రేవంత్ రెడ్డి 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టిపిసిపి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.
5 thoughts on “అనుముల రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర Anumula Revanth Reddy Biography”