డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ జీవిత చరిత్ర, Doctor Malle Boina Anji Yadav Biography

డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ జీవిత చరిత్ర, Doctor Malle Boina Anji Yadav Biography

పరిచయం:

డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ కోదాడ నియోజకవర్గం లో పరిచయం అవసరం లేని పేరు, ఎందుకంటే 2018 సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ,కొన్ని జాతీయ పార్టీలను అధిగమింపజేసి మూడో స్థానంలో నిలిచారు.

డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ జీవిత పరిచయం

పేరుడాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్
తండ్రిమల్లెబోయిన రాములు
తల్లిమల్లెబోయిన సుగుణమ్మ
అన్నయ్యవెంకటేష్ బాబు
అక్క2
జననం1985 నవంబర్ 3
విద్యఉస్మానియా యూనివర్సిటీ నుంచి MA Phd.
పుట్టిన ప్రదేశంఅనంతగిరి
నియోజకవర్గంకోదాడ

తొలి రాజకీయ జీవితం

తెలంగాణ ఉద్యమం నుండి రాజకీయ జీవితం ప్రారంభ మైంది

కోదాడ నియోజకవర్గంలో డాక్టర్ మల్లె బోయిన అంజి యాదవ్ అంటే తెలియని వారు ఉండరు 2018 సాధారణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి సామాజిక న్యాయమే ప్రధాన ఎజెండాగా నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని పర్యటించి ముందుకు వచ్చారు. దీంతో ప్రజలు భ్రమరదం పట్టి కొన్ని జాతీయ పార్టీలను అధిగమింపజేసి మూడో స్థానంలో నిలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల కేంద్రంలో ఒక సామాన్య నిరుపేద రైతు కుటుంబం అయినా మల్లెబోయిన రాములు, సుగుణమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ అన్నయ్య వెంకటేష్ బాబు సంరక్షణలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు అనంతగిరి ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ మరియు డిగ్రీ కోదాడలో పూర్తి చేసుకొని పై చదువులకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎం ఏ ఎకనామిక్స్ లో చేరి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడి చదువుతున్న సమయం అది.

తెలంగాణ ఉద్యమంలో మల్లెబోయిన అంజి యాదవ్

నాటి తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడిన వారిలో తెలంగాణ తొలి అమరవీరుడు శ్రీకాంత్ చారి, ఎన్. సీ.సి గేటు ముందు సిరిపురం యాదయ్య పెట్రోల్ పోసుకొని నిప్పందించుకొని జై తెలంగాణ అంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకు నడిచి ఆత్మ బలిదానం చేసుకున్న సంఘటనలు ఇప్పటికీ కళ్ళముందే కదలాడుతున్నాయి. కోదాడ ప్రాంతానికి చెందిన కాపుగల్లు గ్రామవాసి మీగడ సాయికుమార్ ఓయూ మినిటేక్ హాస్టల్లో ఆత్మబలిదానం చేసుకుంటే హాస్టల్ తలుపులు పగలగొట్టి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సాయికుమార్ ని తన చేతులపై మోసుకొని హాస్పిటల్ కి తరలించిన సన్నివేశాలు ఇప్పటికీ కళ్ళ ముందు కొట్టుమిట్టాడుతున్నాయి.

తెలంగాణ ఉద్యమ సమయంలో 80 కేసులు జైళ్ళనిర్బంధం అనుభవించి ఉస్మానియా హాస్టళ్లకు నీరు, కరెంటు ఆపితే ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ఉన్నంతలోనే ఆకులలో తిని ఆరు బయట నిద్రించారు వలస అధికారుల కను సన్నులలో సాగిన ఆనాటి నరమేధం దాచేస్తే దాగని సత్యం. పోలీసుల లాఠీ చార్జీలలో గాయపడిన నాడు సీమాంధ్ర కనుసన్నులలో తెలంగాణ వ్యతిరేకులను ఆర్ట్స్ కళాశాల సాక్షిగా తరలిన రోజు జరిగిన పోలీస్ కాల్పుల్లో రబ్బర్ బుల్లెట్ల గాయాలు, ఆ గాయపు ఆనవాలను ఇంకా శరీరం మోస్తూనే ఉంది.

ప్రసిద్ధ ఉస్మానియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ లో డాక్టర్ చేసిన ఉన్నత విద్యావంతుడు అయిన డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ గారు ప్రజా సేవే లక్ష్యంగా ఎంచుకొని 2018 సాధారణ ఎన్నికల్లో కోదాడ నియోజకవర్గం లో పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఒక రైతు కూలీ కొడుకుగా బహుజన ఉద్యమ రాజకీయాలు నడుపుతున్న గ్రామీణ ప్రాంతాల దళిత బహుజన వర్గాల వెనుకబాటుతనాన్ని దగ్గరుండి చూసినవాడు కాబట్టి ,అప్పటి నుండి నియోజకవర్గం అంటిపెట్టుకొని ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ నిరుపేద కుటుంబాలకు తన వంతు సాయం అందిస్తూ వారికి అను నిత్యం అందుబాటులో ఉంటూ కరోనా కష్టకాలంలో సైతం ఎంతోమంది పేదవారికి ఉచిత నిత్యవసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్ ఇంకా ఎన్నో రకాలుగా ప్రజలకు సహాయ సహకారాలు అందించారు. ప్రత్యక్ష రాజకీయాలు కొత్త కాకపోయినా కోదాడ నియోజకవర్గం లో గడపగడపకు తిరగాలి అనుకుంటూ తరతరాలుగా తిష్ట వేసి అవినీతిని రూపం మాపడం కోసం మరియు వారసత్వం రాజకీయాల స్థానే నిజమైన ప్రజాస్వామ్య వాతావరణాన్ని ముందుకు తీసుకొని పోవడానికి యువత ముందుకు రావాలి అని బలంగా నమ్ముతున్న వ్యక్తి డాక్టర్ అంజి యాదవ్ గారు.

కల్వ కుంట్ల చంద్రశేఖర రావు జీవిత చరిత్ర

One thought on “డాక్టర్ మల్లెబోయిన అంజి యాదవ్ జీవిత చరిత్ర, Doctor Malle Boina Anji Yadav Biography

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

alekhya chitti hot photos goes viral Preity Mukhundhan : 2 సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ బ్యూటీ Pooja Hegde: సౌత్‌లో విజయాలు, బాలీవుడ్‌లో ఎదురైన సవాళ్లు పాలక్ తివారీ మారిషస్ హాలీడేలో స్టన్నింగ్ లుక్స్‌ ఫోటోలు వైరల్! Varsha Bollamma Telugu Movie List Actress Divi Vadthya ఫిట్‌నెస్ ఫొటోలు ఫ్యాషన్ టచ్‌తో సోషల్ మీడియాలో వైరల్ శ్రీముఖి బీచ్ ఫోటోస్: వైరల్ అవుతున్న తాజా గ్లామర్ స్టిల్స్ చూడండి చమ్కీల చీరలో హెబ్బా పటేల్ అదిరిపోయే లుక్! naga manikanta wife daughter rare photos శ్రద్ధా దాస్ గ్లామర్ పిక్స్ కలకలం