నల్గొండలో గుండె పగిలే ఘటన పేదరికం పేరు చెప్పి…
నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వినగానే హృదయం కదిలిపోతుంది. తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాకు చెందిన గిరిజన దంపతులు కొర్ర పార్వతీ–బాబు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తమ ఇద్దరు పసి పిల్లలను విక్రయించిన సంఘటన బయటపడింది. నలుగురు ఆడపిల్లలతో జీవిస్తున్న ఈ దంపతులు, దళారుల ప్రలోభాలకు లోనై గుంటూరు జిల్లాకు చెందిన వారికి రూ.3 లక్షలకు ఇద్దరు (వయసు 3, 4 ఏళ్లు) చిన్నారులను అమ్మేసినట్టు సమాచారం.
అయితే చెల్లిని అమ్మొద్దంటూ ఏడుస్తూ తల్లిదండ్రుల కాళ్లపై పడిన అక్క దృశ్యం చూసి గ్రామస్తులు, బంధువులు కంటతడి పెట్టారు. చిన్నారుల వేదన, తల్లిదండ్రుల నిరుపాయం చూసిన వారందరూ షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటన వెలుగులోకి రాగానే స్థానిక అధికారులు, బాలల సంక్షేమ శాఖ అలర్ట్ అయ్యి దర్యాప్తు ప్రారంభించారు. పేద, గిరిజన తండాలను లక్ష్యంగా చేసుకుని శిశు విక్రయ దళాలు విస్తృతంగా పనిచేస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండలో బయటపడిన ఈ ఘటన మరోసారి సమాజాన్ని కదిలించే ప్రశ్నను లేవనెత్తింది — పేదరికం ఎంతవరకూ మనసును కఠినతరం చేస్తుంది?
Also Read : ట్రైన్‌లో ఊహించని సీన్ ప్రయాణికులందరికీ షాక్: వాష్‌రూమ్ తలుపు తెరిస్తే కనిపించింది నమ్మలేని దృశ్యం!
