ట్రైన్‌లో ఊహించని సీన్ ప్రయాణికులందరికీ షాక్: వాష్‌రూమ్ తలుపు తెరిస్తే కనిపించింది నమ్మలేని దృశ్యం!
దీపావళి రద్దీ సమయంలో రైళ్లలో కాలు పెట్టడానికి కూడా చోటు దొరకడం లేదు. అలాంటి గందరగోళ సమయంలో ఓ ప్రయాణికుడు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం, అతడు ట్రైన్‌లో సీటు దొరకకపోవడంతో ఒక వింత ఆలోచనకు తెరతీశాడు. ప్రయాణికులు ఉపయోగించే వాష్‌రూమ్‌లోకి వెళ్లి లోపల నుంచి తలుపు లాక్ వేసుకున్నాడు. అంతే కాదు, తన లగేజ్‌ను కూడా లోపలికి తీసుకెళ్లి ఎంచక్కా కూర్చున్నాడు. బయట ఎవరు తలుపు తట్టినా స్పందన లేదు. సహ ప్రయాణికులు ఆశ్చర్యంతో చూడగా, కొంతమంది ఈ సన్నివేశాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్దిసేపట్లోనే ఆ ఫోటో వైరల్ అయింది.
ఈ సంఘటన ఏ రైలులో జరిగిందో, ఆ ప్రయాణికుడు ఎవరో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, అతడు చూపించిన “సృజనాత్మకత” చూసి నెటిజన్లు నవ్వులు ఆపుకోలేకపోతున్నారు. కొందరు “సర్వైవల్ మాస్టర్” అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇది ఇతరులకు ఇబ్బంది కలిగించే పని” అంటూ విమర్శిస్తున్నారు. కానీ ఏదేమైనా, రద్దీ రైలులో వాష్‌రూమ్‌ని బెడ్రూమ్‌గా మార్చిన ఆ ప్రయాణికుడు ఇప్పుడు ఇంటర్నెట్‌లో స్టార్‌గా మారిపోయాడు.
Also Read : AP Housing Sscheme PM Awas Yojan :ఇళ్ల లేని పేదలకు శుభవార్త! Survey డెడ్‌లైన్ నవంబర్ 5
