తల్లికి వందనం డబ్బు జమ కాలేదా? ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హత ఉన్నా డబ్బు రాలేదు అనే పలువురు లబ్ధిదారులకు మరో అవకాశం కల్పించింది. ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది – జూన్ 20లోపు ఫిర్యాదు చేస్తే, జూలై 5న ఖాతాల్లోకి డబ్బు జమ అవుతుంది.
ఫిర్యాదు చేయవలసిన వారెవరు?
- తల్లికి వందనం పథకానికి అర్హత ఉన్నవారు.
- కానీ, జమ కావాల్సిన థాలికి వందనం డబ్బు ఇంకా వారి బ్యాంక్ ఖాతాల్లోకి రాకపోయినవారు.
- గత జాబితాలో పేర్ల లేనివారు లేదా తప్పుగా జమ అయిన వారు.
ఫిర్యాదు ఎలా చేయాలి?
జూన్ 20, 2025 లోపు మీకు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయం వెళ్లి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. మీరు తీసుకెళ్లవలసిన పత్రాలు:
- ఆధార్ కార్డు జిరాక్స్
- బ్యాంక్ పాస్‌బుక్ కాపీ
- తల్లికి వందనం పథకానికి మీరు చేసుకున్న దరఖాస్తు వివరాలు (ఉంటే)
- ఫోన్ నంబర్
ప్రభుత్వం ప్రకటించిన టైమ్‌లైన్
ప్రభుత్వం ప్రకటించిన తాజా టైమ్‌లైన్ ప్రకారం, జూన్ 20 వరకు తల్లికి వందనం డబ్బు జమ కాకపోయిన లబ్ధిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరిస్తారు. అనంతరం, అందిన ఫిర్యాదులను జూన్ 28లోపు వెరిఫై చేసి, అర్హుల పేర్లతో అదనపు జాబితా తయారు చేస్తారు. ఈ జాబితాను జూన్ 30న గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. చివరగా, అర్హుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బును జూలై 5న జమ చేయనున్నారు. లబ్ధిదారులు ఈ తేదీలను గమనించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Thalliki Vandanam Payment Status Check Online ఎలా చెక్ చేయాలి?
మీ తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయాలంటే:
- అధికారక వెబ్ సైట్ https://gsws-nbm.ap.gov.in/NBM/#!/ApplicationStatusCheckP కి వెళ్లండి

- వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత, మెనూలో నుంచి తల్లికి వందనం స్కీమ్‌ను ఎంచుకోవాలి.

- సంవత్సర ఎంపికలో 2025-2026 ని ఎంచుకోవాలి.

- UID విభాగంలో మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.

- ఎరుపు బాక్సులో కనిపించే క్యాప్చా కోడ్‌ను సరిగ్గా నమోదు చేయాలి.

- తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే, మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.

- ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే, మీ స్టేటస్ తెలుసుకోవచ్చు.
ముఖ్య సూచన:
- ఒకవేళ మీ పేర్లు జాబితాలో లేకపోతే, వెంటనే సచివాలయంలో ఫిర్యాదు చేయండి
- జూలై 5న డబ్బు రావాలంటే, వెరిఫికేషన్ పూర్తి కావాలి
- ప్రభుత్వ సూచనలు పాటించడం ద్వారా, మీకు రావాల్సిన నిధులు పొందవచ్చు
తల్లికి వందనం స్టేటస్ చెక్ చేయడంలో ఇబ్బంది వస్తే?
తల్లికి వందనం స్టేటస్‌ను మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా తెలుసుకోవచ్చు. 9552300009 నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపితే, స్కీమ్‌లకు సంబంధించిన ఆప్షన్లు వస్తాయి. అందులో తల్లికి వందనం స్టేటస్ చెక్ ఎంపిక చేసుకుని, ఆధార్ నంబర్‌ను ఇవ్వగానే స్టేటస్ కనిపిస్తుంది.
ఈసారి తల్లికి వందనం పథకంలో డబ్బు జమ కాలేదని బాధపడకండి. జూన్ 20లోపు ఫిర్యాదు చేయండి, జూలై 5న డబ్బు ఖాతాలో ఉంటుంది. ప్రతి అర్హుడికీ ఈ పథకం ప్రయోజనం అందాలి – అందుకోసం ప్రభుత్వంతో సహకరించండి.
Also Read : Annadata Sukhibhava Check Payment Status మీ అర్హత, చెల్లింపు స్థితి తెలుసుకునే విధానం (2025)
2 thoughts on “Thalliki Vandanam Payment Status Check Online ఎలా చెక్ చేయాలి?”