Talliki Vandanam Cyber Scam మీ ఖాతా సురక్షితమా?

Talliki Vandanam Cyber Scam: అప్రమత్తంగా ఉండండి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం జనవర్గాలకు ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. కానీ ఈ పథకం పేరు తీసుకుని కొన్ని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు.
తాజాగా విజయవాడ పరిధిలో ఇద్దరు మహిళలు రూ.48,500ను కోల్పోగా, NTR జిల్లా జి.కొండూరు ప్రాంతంలో మరో ఇద్దరు మహిళల నుంచి రూ.29 వేలు దోచుకున్నారు. నేరగాళ్లు ‘మీ ఖాతా హోల్డ్‌లో ఉంది. మేము చెప్పిన అకౌంట్‌కు డబ్బులు పంపించకపోతే, మీకు తల్లికి వందనం డబ్బు జమకాదు’ అంటూ ఫోన్‌లో భయపెట్టి మోసం చేస్తున్నారు.
- ఫోన్ కాల్స్ ద్వారా భయపెట్టి డబ్బులు పంపించమని డిమాండ్ చేస్తారు.
- అకౌంట్ డీటెయిల్స్, OTPలు అడుగుతారు.
- పథకానికి అర్హులం అని నమ్మించేందుకు అధికారుల్లా నటిస్తారు.
- అకౌంట్ లింకులు లేదా QR కోడ్ పంపించి మోసానికి గురి చేస్తారు.
తల్లికి వందనం పథకం – నిజమైన సమాచారం కోసం ఎక్కడ చూడాలి?
- గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు అందుబాటులో ఉంటాయి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లేదా మె seva పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు.
- ఎవరికైనా సందేహాలుంటే స్థానిక వాలంటీర్లను సంప్రదించవచ్చు.
2 thoughts on “Talliki Vandanam Cyber Scam మీ ఖాతా సురక్షితమా?”