Neelam Madhu Mudiraj Age, Date of Birth, Education, Family, Political Career

Neelam Madhu Mudiraj Age, Date of Birth, Education, Family, Political Career

Neelam Madhu Mudiraj Introduction

Neelam Madhu Mudiraj : తెలంగాణ రాష్ట్రంలో గొప్ప నాయకులలో ఒకరిగా నిలిచిన నీలం మధు ముదిరాజ్ (Neelam Madhu Mudiraj) రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం, చిట్కుల్ గ్రామంలో జన్మించారు. తండ్రి నీలం నిర్మల్, తల్లి సాధారణ గృహిణి. చిన్నతనం నుంచే గ్రామ జీవితాన్ని దగ్గరగా చూశారు.

Neelam Madhu Mudiraj Age, Date of Birth, Education, Family

పేరునీలం మధు ముదిరాజ్
జననం14 March 1983
వయసు42
పుట్టిన ప్రదేశం                చిట్కుల్ గ్రామం, పటాన్‌చెరు మండలం, సంగారెడ్డి జిల్లా,
రాజకీయ పార్టీ                 కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి కవిత
సంతానం          2
వృత్తి   రాజకీయ నాయకుడు
తండ్రినీలం నిర్మల్
తల్లినీలం రాధ
విద్యపదవ తరగతి
FacebookClick Here
InstagramClick Here
TwitterClick Here

అయితే ఆయన విద్యాబ్యాసం ఎక్కువ దూరం వెళ్లకపోయినా, 1997-98 విద్యా సంవత్సరంలో జెడ్పీ హైస్కూల్, ముత్తంగిలో 8వ తరగతి వరకు చదువుకున్నారు. చిన్న వయసులోనే వ్యవసాయం మరియు వ్యాపారంలో ప్రవేశించారు.

Neelam Madhu Mudiraj Political Career

నీలం మధు తెలంగాణ మలి దశ ఉద్యమంలో పాల్గొంటూ రాజకీయాల పట్ల ఆసక్తితో 2006లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చిట్కుల్ గ్రామ వార్దు సభ్యుడిగా మరియు ఆ తరువాత 2014లో ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆయన 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) (అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి) తరపున జెడ్పీటిసిగా పోటీ చేసి ఓడిపోయారు.

నీలం మధు 20019లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చిట్కుల్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నీలం మధు ఎన్ఎంఆర్ యువసేన ను స్థాపించి పటాన్‌చెరు నియోజకవర్గంలో వివిధ సామజిక కార్యక్రమాలు నిర్వహించి 2023లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించారు, కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన 2023 అక్టోబర్ 16న బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

నీలం మధు ఆ తరువాత అక్టోబర్ 27న ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు మొదట ఎమ్మెల్యే టికెట్ కేటాయించగా పటాన్‌చెరు నియోజకవర్గంలో పెద్దఎత్తున నిరసనలు రావడంతో అతనికి కాకుండా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్​ఛార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, నవంబర్ 10 న బహుజన్ సమాజ్ పార్టీలో (బిఎస్పీ) చేరారు.

ఆయన ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసి 46162 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. నీలం మధు గారు 2024 ఫిబ్రవరి 13 న బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి , ఫిబ్రవరి 15న హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దీప్‌దాస్‌ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) లో చేరిక

BSPలో కొంతకాలం ఉన్న నీలం మధు ముదిరాజ్, 2024 ఫిబ్రవరి 15న కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో చేరిన వెంటనే మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2024 భారత సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు.

భవిష్యత్తు ప్రణాళికలు & నాయకత్వ లక్ష్యాలు

నీలం మధు ముదిరాజ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదుగుతున్నారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత, బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ తదితర సామాజిక న్యాయ నినాదాలతో ముందుకెళ్లుతున్నారు.

తెలంగాణలో బలమైన బీసీ నాయకుడిగా ఎదుగుతున్న నీలం మధు ముదిరాజ్, ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలతో రాజకీయాల్లో మరింత దూకుడు ప్రదర్శించే అవకాశం ఉంది.

గ్రామస్థాయిలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నీలం మధు ముదిరాజ్, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో తన బలాన్ని నిరూపించుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం ఉంది.

Also Read : Taneti Vanitha Biography

3 thoughts on “Neelam Madhu Mudiraj Age, Date of Birth, Education, Family, Political Career

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *