Nara Lokesh Email id: ప్రజల కోసం ఈమెయిల్ ఐడీ – సమస్యలు, వినతులు నేరుగా పంపండి

ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల సమస్యలు, వినతులను నేరుగా స్వీకరించడానికి తన వ్యక్తిగత ఈమెయిల్ ఐడీ “hello.lokesh@ap.gov.in” ను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వస్తున్న వాట్సాప్ సందేశాల కారణంగా ఆయన ఖాతా పలు మార్లు బ్లాక్ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నారా లోకేష్, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పంపేందుకు ఈ కొత్త మార్గాన్ని సూచించారు.
ఎన్నికల ముందు “నా తలుపు ఎల్లప్పుడూ ప్రజల కోసం తెరిచి ఉంటుంది” అని హామీ ఇచ్చిన లోకేష్, గెలుపుతో పాటు మంత్రి పదవిని స్వీకరించిన తర్వాత కూడా ప్రతి రోజూ ఉండు వల్లి నివాసంలో ప్రజలతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇటీవల 25మంది దివ్యాంగ విద్యార్థుల సమస్యను ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా వెంటనే పరిష్కరించారు. అయితే, వేల సంఖ్యలో వచ్చే సందేశాల వలన వాట్సాప్ ఖాతా తిరుగుతిరుగు బ్లాక్ అవుతుండటంతో, ప్రజలకు అసౌకర్యం కలగకుండా నేరుగా ఈమెయిల్ ద్వారా వినతులు పంపాలని సూచించారు.
“హలో లోకేష్” పేరుతో యువతలోకి చేరువైన తన పాదయాత్రల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కిందే nara lokesh email id సృష్టించబడింది. ఈ ఐడీకి పంపిన ప్రతి సమస్యను వ్యక్తిగతంగా పరిశీలించి పరిష్కరించనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. వినతి పంపేటప్పుడు పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, సమస్య లేదా అభ్యర్థన వివరాలు పూర్తిగా ఇవ్వాలని సూచించారు.
Also Read : స్త్రీ శక్తి పథకం: ఎలాంటి గుర్తింపు కార్డులు చూపించి ఉచిత ప్రయాణం చేయచ్చు? ఏ బస్సుల్లో వర్తిస్తుంది?
One thought on “Nara Lokesh Email id: ప్రజల కోసం ఈమెయిల్ ఐడీ – సమస్యలు, వినతులు నేరుగా పంపండి”