K T Rama Rao : కల్వకుంట్ల తారక రామరావు (KTR) తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం ఆయన సిరిసిల్ల నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు. 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలో సమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, వస్త్రోత్పత్తి మరియు ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కేటీఆర్ గా ప్రసిద్ధి చెందిన ఆయన, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమారుడిగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. భాషాపరంగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల్లో నిపుణత్వం కలిగి ఉన్నారు. 2008లో తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. తన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటి నుండి తెలంగాణ అభివృద్ధికి విశేషమైన కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు.
K T Rama Rao Age, Date of Birth,Family
| పేరు | కల్వకుంట్ల తారక రామరావు (KTR) |
| జన్మతేది | 1976, జూలై 24 |
| జన్మస్థలం | కొదురుపాక, బొయినపల్లి మండలం సిరిసిల్ల జిల్లా |
| వయసు | 48 |
| తండ్రి | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు |
| తల్లి | శోభ |
| చెల్లెలు | కల్వకుంట్ల కవిత |
| జీవిత భాగస్వామి | శైలిమ |
| సంతానం | హిమాన్ష్ (కొడుకు), అలేఖ్య (కూతురు) |
| రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి |
| వృత్తి | రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త |
| విద్య | BSc (Osmania) in Hyderabad MSc (Pune) MBA (Baruch College) in United States |
| https://x.com/ktroffice | |
| https://www.facebook.com/KTRTRS/ | |
| https://www.instagram.com/ktrtrs |
తారక రామారావు 1976 జూలై 24న తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేటలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు శోభ దంపతులకు జన్మించారు. తన విద్యాబ్యాసాన్ని కరీంనగర్‌లో ప్రారంభించి, హైదరాబాదులోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేశారు. 1990-91లో హైదరాబాద్‌లోని జీజీ స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశారు.
ఇందుకు కొనసాగింపుగా, 1991-93 మధ్య గుంటూరులోని విజ్ఞాన్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివారు. మెడిసిన్‌లో ప్రవేశం పొందడానికి హైదరాబాద్‌లో ఎంట్రన్స్ పరీక్ష రాశారు, అయితే కర్ణాటకలో వచ్చిన మెడికల్ సీటును తీసుకోకుండా, నిజాం కాలేజీలో మైక్రోబయాలజీ డిగ్రీకి చేరారు.
1996-98 మధ్య మహారాష్ట్రలోని పూణే విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. అనంతరం 1998-2000 మధ్య అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఐదేళ్ల పాటు పనిచేశారు.
K T Rama Rao Political Career
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి తారక రామారావు 2004లో అమెరికాలో ఉన్న తన ఉద్యోగాన్ని రాజీనామా చేసి, రాజకీయాల్లో క్రియాశీలంగా ప్రవేశించారు. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపించడంతో, 2006లో ఎంపీ పదవికి రాజీనామా చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించి తన రాజకీయ ప్రతిభను ప్రదర్శించారు.
2008లో మరోసారి కేసీఆర్‌తో పాటు టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి తిరిగి ఎన్నికల బరిలోకి దిగారు. ఈ సమయంలో కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి తన ప్రత్యేక శైలిని చాటిచెప్పారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా సిరిసిల్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై కేవలం 171 ఓట్ల తేడాతో గెలిచారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కేటీఆర్, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగి, కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయన రాజకీయంగా మరింత బలమైన నాయకుడిగా ఎదిగారు.
3 thoughts on “K T Rama Rao Biography కే టీ రామరావు బయోగ్రఫీ”