kalvakuntla kavitha Biography కల్వకుంట్ల కవిత బయోగ్రఫీ

kalvakuntla kavitha Biography : కల్వకుంట్ల కవిత 1978 మార్చి 13న కరీంనగర్ పట్టణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (తెలంగాణ తొలి ముఖ్యమంత్రి) మరియు శోభ దంపతులకు జన్మించారు. ఈమే ఒక చారిత్రక నాయకురాలు.
kalvakuntla kavitha Date of Birth, Age, Family
పేరు | కల్వకుంట్ల కవిత |
జన్మతేది | 13 మార్చి 1978 |
జన్మస్థలం | కరీంనగర్, తెలంగాణ |
వయసు | 47 |
తండ్రి | కల్వకుంట్ల చంద్రశేఖరరావు |
తల్లి | కల్వకుంట్ల శోభ |
జీవిత భాగస్వామి | దేవన్‌పల్లి అనిల్ |
సంతానం | ఆదిత్య (2003లో జననం) ఆర్య (2007లో జననం) |
రాజకీయ పార్టీ | Bharat Rashtra Samithi |
వృత్తి | రాజకీయ నాయకురాలు |
విద్య | Graduate Professional |
నియోజకవర్గం | నిజామాబాద్ |
కల్వకుంట్ల కవిత (జననం: మార్చి 13, 1978) భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకురాలు మరియు తెలంగాణ జాగృతి సంస్థ యొక్క వ్యవస్థాపకురాలు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం జరిగిన ఉద్యమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. 2020 నుండి నిజామాబాద్ శాసన మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంతకుముందు, 2014 నుండి 2019 వరకు, ఆమె నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి పార్లమెంట్ సభ్యురాలిగా సేవలందించారు.
ప్రారంభ జీవితం
కల్వకుంట్ల కవిత 1978 మార్చి 13న కరీంనగర్ పట్టణంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (తెలంగాణ తొలి ముఖ్యమంత్రి) మరియు శోభ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను స్టాన్లీ బాలికల పాఠశాలలో పూర్తిచేసిన ఆమె, ఇంజనీరింగ్ డిగ్రీని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి పొందారు. తర్వాత, అమెరికన్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు.
ఆమె సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా అమెరికాలో పని చేసినప్పటికీ, 2004లో భారతదేశానికి తిరిగి వచ్చి, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పని చేయాలనే సంకల్పం వ్యక్తం చేశారు.
కల్వకుంట్ల కవిత మొదటి భర్త పేరు
కల్వకుంట్ల కవిత మొదటి భర్త దేవన్‌పల్లి అనిల్ ను వివాహం చేసుకున్నారు..దేవన్‌పల్లి అనిల్ ఒక మెకానికల్ ఇంజనీరుగా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఆదిత్య (2003లో జననం) మరియు ఆర్య (2007లో జననం) ఉన్నారు.
రాజకీయ జీవితం
కల్వకుంట్ల కవిత 2009 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు. అయితే, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు.
2020లో జరిగిన తెలంగాణ శాసనమండలి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి పోటీ చేసి 672 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిచారు. 2020 అక్టోబర్ 29న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన ఆమె, 2021 మార్చి 18న తొలిసారిగా శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. 2021 సెప్టెంబర్ 27న మండలిలో ఎమ్మెల్సీగా మొదటిసారిగా స్థానిక సంస్థల సమస్యలపై ప్రసంగించారు.
2021లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో, టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఆమె ఎంపిక అయ్యారు. నవంబర్ 26న ఏకగ్రీవంగా ఎన్నికై గెలుపు పత్రాన్ని అందుకున్నారు. 2022 జనవరి 19న రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు.
పార్లమెంటరీ కమిటీలు
పార్లమెంటులో, కల్వకుంట్ల కవిత వివిధ కమిటీలలో సభ్యురాలిగా పనిచేశారు. వీటిలో ఎస్టిమేట్స్ కమిటీ, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖలు ఉన్నాయి.
కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్
కామన్వెల్త్ మహిళా పార్లమెంటేరియన్స్ ఇండియా రీజియన్ స్టీరింగ్ కమిటీలో కవిత నామినేట్ చేయబడ్డారు. మహిళా ప్రతినిధుల సంఖ్యను పెంచడం కోసం ఆమె విశేషంగా కృషి చేశారు.
పార్లమెంటరీ ప్రతినిధి బృందాలు
కవిత అధికారిక ప్రతినిధిగా కంబోడియా, లావోస్‌లకు ఉపాధ్యక్షుని బృందంలో పాల్గొన్నారు. అలాగే, యూరోపియన్ పార్లమెంట్‌కు లొక్‌సభ స్పీకర్ ప్రతినిధిగా బెల్జియం బ్రస్సెల్స్‌కు వెళ్లారు.
కవిత తన స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండలం, పోతంగల్ గ్రామంలో తన సొంత ఖర్చుతో శ్రీరాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించారు. 2022 జూన్ 4 నుండి 9వ తేదీ వరకు ఈ దేవాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ ఉద్యమం
వివాహానంతరం కల్వకుంట్ల కవిత తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. 2006లో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీపై వెనుకడుగు వేసిన కారణంగా కేసీఆర్ కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ఈ పరిణామం మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది. ఆ సమయంలో కవిత తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడం కోసం తెలంగాణ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.
తన కృషి ద్వారా మారుమూల గ్రామాల అభివృద్ధికి నడుం బిగించిన కవిత, 2006లో నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు. అక్కడి పేద పిల్లలకు ఉచిత విద్యను అందించి, గ్రామీణ ప్రజలకు భరోసా కల్పించారు. 2009లో తెలుగు సినిమాలలో తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళన చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నంది అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా నిరసన తెలిపారు. 2010లో అదుర్స్ సినిమా విడుదలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం ద్వారా ఆమె వార్తల్లో నిలిచారు.
తెలంగాణ జాగృతి
తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని నిరసించేందుకు, తెలంగాణ ప్రజా ఉద్యమం నుంచి ప్రేరణతో 2006లో కవిత తెలంగాణ జాగృతి సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థను 2007లో అధికారికంగా నమోదు చేశారు. తెలంగాణ ప్రజల మనసుకు అత్యంత దగ్గరగా ఉన్న పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటి. కవిత పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలు నిర్వహించి, తెలంగాణ కళలను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహిళలు, యువత, సమాజంలోని అన్ని వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది.
తెలంగాణ జాగృతి నైపుణ్య కేంద్రాలు
తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలను అందించేందుకు, కవిత తెలంగాణ జాగృతి స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు.
బతుకమ్మ వేడుకలు
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కవిత బతుకమ్మ వేడుకలను తెలంగాణలోనే కాకుండా ప్రపంచంలోని 30కి పైగా దేశాల్లో నిర్వహించారు. బతుకమ్మ పండుగను అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా చేశారు.
కార్మిక సంఘాలు
- కవిత కార్మిక సంఘాల హక్కుల కోసం పనిచేస్తూ, ఈ క్రమంలో వివిధ పదవులను చేపట్టారు:
- తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు
- తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలు
స్కౌట్స్ అండ్ గైడ్స్
2015లో కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎన్నికయ్యారు. భారతదేశంలో ఈ పదవిని అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. 2021లో రెండవసారి ఈ పదవికి ఎంపికయ్యారు.
కవిత తన సేవలతో రాజకీయాల్లో, సామాజిక రంగంలో తెలంగాణ కోసం వెలకట్టలేని కృషి చేస్తున్నారు.
Also Read : Kalvakuntla Chandrasekhar Rao Biography
One thought on “kalvakuntla kavitha Biography కల్వకుంట్ల కవిత బయోగ్రఫీ”