వచ్చే ఎలక్షన్స్ కి తెలంగాణ బిజెపి పార్టీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా మొదటి జాబితాగా 38 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లుగా విడుదల చేసింది
తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి ఇందులో భాగంగా గెలుపు అభ్యర్థుల లిస్ట్ తయారు చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి ఇప్పటికే అధికార పార్టీ భారతీయ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితాను ప్రకటించగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ లిస్టులకు తుదిమెరుగులు దిద్దుతున్నాయి అయితే భారతీయ జనతా పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న గెలుపు అభ్యర్థుల జాబితాను మూడు దశల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
అయితే అందులో ఏకాభిప్రాయంతో భారతీయ జనతా పార్టీ 38 మందితో కూడిన తొలి జాబితాను సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి కూడా పంపించింది ఈ జాబితాను భారతీయ జనతా పార్టీ నాయకత్వం పరిశీలించి ఏమైనా మార్పులు ఉంటే చేసి ఆ మొదటి జాబితా లిస్ట్ని ఈనెల 15వ తారీకు లేదా 16వ తారీఖున తొలి జాబితాను విడుదల చేస్తారని వార్తలు వస్తున్నాయి.
రాష్ట్ర నాయకత్వం ఏకాభిప్రాయంతో సిద్ధం చేసి భారతీయ జనతా పార్టీ అధిష్టానానికి పంపించిన అభ్యర్థుల జాబితా లిస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ లిస్టులో ముఖ్యమైన నేతలంతా ఉన్నారు. అంతేకాకుండా ఎంతో ఆసక్తిగా చూస్తున్న గోషామహల్ , ముషీరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ఈ లిస్టులోనే ప్రకటించారు. ఈ అభ్యర్థుల జాబితా గురించి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనిపై అధికారికంగా ప్రకటన రావలసి ఉంది .
ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కూడా మొదటి జాబితాగా 38 అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లుగా విడుదల చేసింది
| అభ్యర్థులు | నియోజకవర్గం |
| కిషన్ రెడ్డి | అంబర్పేట |
| విజయలక్ష్మి | ముషీరాబాద్ |
| మర్రి శశిధర్ | సనత్ నగర్ |
| ప్రభాకర్ | ఉప్పల్ |
| రామచంద్ర రావు | మల్కాజ్గిరి |
| చింతల రామచంద్రారెడ్డి | ఖైరతాబాద్ |
| విక్రమ్ గౌడ్ | గోషామహల్ |
| శ్రీరాములు | మహేశ్వరం |
| తల్లోజు ఆచారి | కల్వకుర్తి |
| డీకే అరుణ | గద్వాల్ |
| జితేందర్ రెడ్డి | మహబూబ్నగర్ |
| కొండా విశ్వేశ్వర్ రెడ్డి | తాండూరు |
| బూర నర్సయ్య గౌడ్ | ఇబ్రహీంపట్నం |
| శ్రీశైలం గౌడ్ | కుత్బుల్లాపూర్ |
| గూడూరు నారాయణరెడ్డి | భువనగిరి |
| కాసం వెంకటేశ్వర్లు | ఆలేరు |
| ఈటల రాజేందర్ | హుజురాబాద్ |
| బండి సంజయ్ | కరీంనగర్ |
| చొప్పదండి ఎర్రబెల్లి ప్రదీప్ రావు | వరంగల్ తూర్పు |
| చందుపట్ల కీర్తి రెడ్డి | భూపాలపల్లి |
| చెన్నమనేని వికాస్ రావు | వేములవాడ |
| రఘునందన్ రావు | దుబ్బాక |
| పాయల్ శంకర్ | అదిలాబాద్ |
| సోయం బాపూరావు | బోత్ |
| మహేశ్వర్ రెడ్డి | నిర్మల్ |
| ధర్మపురి అరవింద్ | ఆర్మూర్ |
| కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి | మునుగోడు |
| సంకినేని వెంకటేశ్వర్లు | సూర్యాపేట |
| ప్రేమేందర్ రెడ్డి | పరకాల |
| శ్రీధర్ | వర్ధన్నపేట |
| హుస్సేన్ నాయక్ | మహబూబాబాద్ |
| బండ కార్తీక ప్రకాష్ రెడ్డి | నర్సంపేట |
| రాకేష్ రెడ్డి | వరంగల్ వెస్ట్ |
| విజయ రామారావు | స్టేషన్ ఘన్పూర్ |
| శ్రీనివాస్ రెడ్డి | రాజేంద్రనగర్ |
దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మరియు వోట్ ద్వారా తెలియ చేయండి.
మరిన్ని వార్తలు : వచ్చే ఎన్నికల్లో కోదాడ్ నియోజక వర్గం గెలుపు ఎవరిదీ?