Bandi Sanjay Kumar Biography బండి సంజయ్ కుమార్ బయోగ్రఫీ

బండి సంజయ్ కుమార్ తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి 17వ మరియు 18వ లోక్ సభకు ఎంపికయ్యారు. 2024 జూన్ 9న ఆయన్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. జూన్ 10న కేంద్ర హోం శాఖలో సహాయ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

1971 జూలై 11న బండి సంజయ్, శకుంతల మరియు నర్సయ్య దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. చిన్నప్పటినుంచే సంజయ్ విద్యాభ్యాసం సరస్వతి శిశుమందిర్ లో ప్రారంభమైంది, అదే సమయంలో ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కార్యకలాపాల్లో చురుకైన భాగస్వామిగా మారారు. విద్యార్థి దశలోనే ఘటన్ నాయక్ మరియు ముఖ్య శిక్షక్ గా పని చేశారు.

ఒక సమయంలో రాజకీయ పరిస్థితుల వల్ల అద్వానీ రథయాత్ర నిలిచిపోయింది. అప్పుడు బండి సంజయ్ ను ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో సహాయకుడిగా నియమించారు.

Bandi Sanjay date of birth, Age, Family

పేరుబండి సంజయ్ కుమార్
జన్మతేదిజూలై 11, 1971
జన్మస్థలంకరీంనగర్ , తెలంగాణ
వయసు53
తండ్రినర్సయ్య
తల్లిశకుంతల
జీవిత భాగస్వామి అపర్ణ
సంతానం భగీరథ్, సుముఖ్‌
రాజకీయ పార్టీBJP (భారతీయ జనతా పార్టీ)
వృత్తి   రాజకీయ నాయకుడు
విద్యMA (public admn)
Instagramhttps://www.instagram.com/bandisanjay_bjp
Facebookhttps://www.facebook.com/bandisanjaykumar/
Twitterhttps://x.com/bandisanjay_bjp

Bandi Sanjay Political Career

బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ABVP)లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, ఉపాధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కీలక పదవులు నిర్వహించారు. 1994 నుండి 2003 వరకు రెండు టెర్ముల పాటు కరీంనగర్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్‌గా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చాలో ఆయన్ను పట్టణ ప్రధాన కార్యదర్శిగా, పట్టణ అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా వివిధ స్థాయిలలో బాధ్యతలు చేపట్టారు. అలాగే బీజేపీ తరపున కేరళ, తమిళనాడు రాష్ట్రాల ఇంచార్జిగా వ్యవహరించారు.

2005లో ఏర్పాటు చేసిన కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బండి సంజయ్ 48వ డివిజన్ నుండి బీజేపీ తరఫున పోటీచేసి మూడుసార్లు కార్పొరేటర్‌గా గెలుపొందారు. అనంతరం కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడిగా రెండు సార్లు బాధ్యతలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ స్థానం నుండి పోటీచేసినా విజయం సాధించలేకపోయారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో కూడా కరీంనగర్ నుండి పోటీచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేత ఓడిపోయారు.

అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థిగా కరీంనగర్ నియోజకవర్గం నుండి పోటీచేసి, టీఆర్‌ఎస్ అభ్యర్థి బి. వినోద్ కుమార్ పై 89,508 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

2020 మార్చి 11న బండి సంజయ్ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు మరియు 2023 జూలై 4 వరకు ఆ పదవిలో కొనసాగారు. తరువాత జూలై 8న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా, జూలై 29న జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన పార్టీ ద్వారా నియమితులయ్యారు. అదే సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుండి పోటీచేసి ఓటమి పాలయ్యారు.

2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల ముందు, కిసాన్ మోర్చా ఇంచార్జిగా బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జనవరి 3న నియమించారు.

తదుపరి 2024లో జరిగిన 18వ లోక్ సభ ఎన్నికల్లో బండి సంజయ్ మరోసారి కరీంనగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావుపై 2,25,209 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఈ విజయానికి గుర్తింపుగా, ఆయనను 2024 జూన్ 9న మోదీ మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు.

Also Read : kalvakuntla kavitha Biography కల్వకుంట్ల కవిత

Leave a Comment

alekhya chitti hot photos goes viral Preity Mukhundhan : 2 సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ బ్యూటీ Pooja Hegde: సౌత్‌లో విజయాలు, బాలీవుడ్‌లో ఎదురైన సవాళ్లు పాలక్ తివారీ మారిషస్ హాలీడేలో స్టన్నింగ్ లుక్స్‌ ఫోటోలు వైరల్! Varsha Bollamma Telugu Movie List Actress Divi Vadthya ఫిట్‌నెస్ ఫొటోలు ఫ్యాషన్ టచ్‌తో సోషల్ మీడియాలో వైరల్ శ్రీముఖి బీచ్ ఫోటోస్: వైరల్ అవుతున్న తాజా గ్లామర్ స్టిల్స్ చూడండి చమ్కీల చీరలో హెబ్బా పటేల్ అదిరిపోయే లుక్! naga manikanta wife daughter rare photos శ్రద్ధా దాస్ గ్లామర్ పిక్స్ కలకలం