25 Apr 2025, Fri

T Raja Singh Biography టి. రాజాసింగ్

T Raja Singh

Introduction

T Raja Singh తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. రాజాసింగ్ గారు 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున గోషామహల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. టి.రాజాసింగ్ గారు 1977, ఏప్రిల్ 15న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోషామహల్లో టి. నావల్ సింగ్, రామి భాయి దంపతులకు జన్మించాడు. అతను పూర్వికులు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం నుండి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు.

పేరు టి. రాజాసింగ్
జననం 15 ఏప్రిల్ 1977
వయసు 47
పుట్టిన ప్రదేశం హైదరాబాదులోని గోషామహల్లో
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామిఉషాబాయి
సంతానంముగ్గురు కుమారులు, ఒక కుమార్తె
వృత్తి రాజకీయ నాయకుడు
తండ్రి    టి. నావల్ సింగ్
తల్లి రామి భాయి
నియోజకవర్గం గోషామహల్
AddressH.No.13-2-292/7, Aramghar Colony, Near Jali Hanuman, Dhoolpet, Hyderabad, Telangana-500006
Contact number+91-9000214000
Emailt.rajasinghlodh@gmail.com

T Raja Singh Political Career

రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ రంగం ప్రవేశం చేశారు. టైగర్ రాజా సింగ్ గారు 2009 హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి, 2009 నుండి 2014 వరకు కార్పోరేటర్ గా పనిచేశారు. రాజాసింగ్ గారు 2014లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP)నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. అనంతరం 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నుండి పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నారు.

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా చేయడం, ఆయన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడానికి బీజేపీ నిరాకరించి, డిసెంబర్ 14న గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై అనంతరం ఆయన శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు.

రాజాసింగ్‌ ను 2024 జనవరి 08న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి బీజేపీ పార్టీ నియమించింది.

హైదరాబాద్ జూమెరత్ బజార్ లో స్వాతంత్ర్య సమరయోధురాలు, రాణి అవంతి భాయ్ విగ్రహం తొలగింపు సంఘటనపై రాజాసింగ్‌పై కేసు నమోదైంది. అతను ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ పై అభ్యంతరం తెలిపాడు. 2020, సెప్టెంబరులో రాజా సింగ్ హింసను ప్రేరేపించే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తమ నియమావళిని ఉల్లంఘించినందుకు ఫేస్‌బుక్‌ అతను వ్యక్తిగత ఫేస్‌బుక్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాపై నిషేధం విధించింది.

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడనే కారణంతో 2022 ఆగస్టు 23న ఆయనను పార్టీ నుండి అధిష్ఠానం బహిష్కరణ చేసింది. పార్టీ విధానాల‌కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు శాస‌నస‌భాప‌క్ష ప‌ద‌వి నుంచి తొల‌గించి ఆయనపై చ‌ర్యలు తీసుకుంది. 2023లో జరిగే శాసనసభ ఎన్నికల సందర్బంగా ఆయనపై ఉన్న సస్పెన్షన్‌ను  పార్టీ నాయకత్వం 2023 అక్టోబర్ 22న ఎత్తివేసింది.

Also Read : Neelam Madhu Mudiraj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *