SVSN Varma Biography ఎస్ వి ఎస్ ఎన్ వర్మ బయోగ్రఫీ

SVSN Varma Biography ఎస్ వి ఎస్ ఎన్ వర్మ బయోగ్రఫీ

SVSN Varma : ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రజాసేవకుడు. ఆయన ప్రజాసంక్షేమ కార్యక్రమాల్లో సుదీర్ఘ అనుభవాన్ని కలిగి, సమాజ అభివృద్ధికి తన వంతు సేవలందిస్తున్నారు. ఎస్‌.వి.ఎస్‌.ఎన్. వర్మ ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రాజకీయ నాయకుడు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, పిఠాపురం నియోజకవర్గం నుండి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేశారు.

SVSN Varma Date of Birth, Wife, Education, Family

పేరుఎస్.వి.ఎస్.ఎన్. వర్మ
జన్మతేది1964
జన్మస్థలంపి. దొంతమూరు గ్రామం, పెద్దాపురం మండలం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వయసు51
తల్లిదండ్రులురాఘవరాజు
జీవిత భాగస్వామి లక్ష్మి దేవి
సంతానం గిరీష్, కావ్యపద్మజ
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
వృత్తి   రాజకీయ నాయకుడు
విద్యాభాసంకొత్తకోట ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసారు

SVSN Varma Political Career

SVSN Varma రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రారంభించారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసినా, విజయాన్ని సాధించలేకపోయారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కకపోవడంతో, స్వతంత్ర అభ్యర్థిగా (టీడీపీ రెబల్‌గా) బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబుపై 47,080 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో, 2014 మే 22న తిరిగి టీడీపీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి, తన ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. 2021లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు.

2024 శాసనసభ ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీ జనసేన, భాజపాతో కలిసి పొత్తు పెట్టుకుంది. ఈ కూటమిలో భాగంగా పిఠాపురం అసెంబ్లీ స్థానం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు కేటాయించబడింది. పార్టీ ఆదేశాల మేరకు వర్మ కూటమి తరఫున పనిచేసి, పవన్ కళ్యాణ్ విజయానికి తన సహాయాన్ని అందించారు.

Also Read : Nara Lokesh Biography

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *