Ration Card Status : తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ నుండి రేషన్ కార్డు తెలంగాణ పరిధిలో కొత్త కార్డులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఈ కొత్త కార్డుల ద్వారా ప్రజలకు మరింత సమర్థవంతమైన పౌర సేవలు అందించనున్నారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల ఆధారంగా పాత లిస్ట్‌లో ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కొనసాగుతుంది.
రేషన్ కార్డు తెలంగాణలో మార్పులు
తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు విధానంలో కీలక మార్పులు తీసుకువస్తోంది. ఇతర రాష్ట్రాలను అనుసరిస్తూ, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ వేగవంతమైంది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన ప్రకారం, ఏప్రిల్ నుంచి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటికే మీ సేవా, ప్రజా పాలన, గ్రామ సభ, కులగణన సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మార్పుల ప్రక్రియలో చాలా మంది దరఖాస్తుదారులకు ration card status అప్డేట్ అయినట్లు తెలుస్తోంది.
మీ రేషన్ కార్డు వివరాలు ఇలా చెక్ చేయండి
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా రేషన్ కార్డు సమాచారాన్ని సులభంగా పొందవచ్చు.
తెలంగాణ రేషన్ కార్డు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక్కడ FSC REF NO లేదా RATION CARD NO లేదా OLD RATION CARD NO సెలెక్ట్ చేసుకొని DISTRICT సెలెక్ట్ చేసుకొని search Button మీద click చేయండి

మీ కుటుంబ సభ్యుల పేర్లు లిస్ట్‌లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను కూడా ఇక్కడ పొందవచ్చు.
రేషన్ కార్డు ద్వారా లబ్ధి
- పాత లిస్ట్‌లో ఉన్న వారికి ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ.
- రాష్ట్రవ్యాప్తంగా ఏ రేషన్ షాప్‌లోనైనా సరఫరా పొందే వీలుంటుంది.
- కొత్త రేషన్ కార్డు పొందేందుకు మీ వివరాలను అధికారికంగా నమోదు చేసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా నుంచి రేషన్ కార్డు ఆధారంగా బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మీ ration card status తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
1 thought on “Ration Card Status : మీ పేరు జాబితాలో ఉందా? ఇలా చెక్ చేసుకోండి”