Rajiv Yuva Vikasam Scheme Telangana 2025: అప్లై చేసేవారు గమనించండి… మారిన నిబంధనలు ఇవే!

Rajiv Yuva Vikasam Scheme Telangana 2025: అప్లై చేసేవారు గమనించండి… మారిన నిబంధనలు ఇవే!

rajiv yuva vikasam scheme telangana 2025: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యువత అభివృద్ధి పథకానికి సంబంధించి కొన్ని నిబంధనల్లో మార్పులు చేశారు. రుణానికి దరఖాస్తు చేసుకునే వారికి ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకపై కేవలం రేషన్ కార్డు ఆధారంగా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మార్పులు, రుణ పరిమితి, సబ్సిడీ శాతం, దరఖాస్తు విధానం వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Rajiv Yuva Vikasam Scheme Telangana 2025 Application – మారిన నిబంధనలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన (rajiv yuva vikasam scheme telangana) యువత అభివృద్ధి రుణ పథకానికి సంబంధించి అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా ఆదాయ ధృవీకరణ పత్రం తప్పనిసరి కాదని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రేషన్ కార్డు ఉంటే కూడా దరఖాస్తు చేసుకునే వీలుంది. ఏప్రిల్ 14, 2025 వరకు దరఖాస్తుల స్వీకరణను పొడిగించారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు ఆదాయ ధృవీకరణ పత్రం లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు:

ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ వర్గాలకు చెందిన యువత అర్హులు.

రుణ పరిమితి & సబ్సిడీ శాతం:

  • రూ. 50,000 – 100% సబ్సిడీ
  • రూ. 1,00,000 లోపు – 90% సబ్సిడీ
  • రూ. 1-2 లక్షలు – 80% సబ్సిడీ
  • రూ. 2-4 లక్షలు – 70% సబ్సిడీ

దరఖాస్తు విధానం:

  • Rajiv Yuva Vikasam Scheme Registration మీద క్లిక్ చేయండి
  • తరువాత మనకు ఇలా ఓపెన్ అవుతుంది.
  • తరువాత Click here to Application Form for Rajiv Yuva Vikasam Scheme మీద క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి.
  • వివరాలు నమోదు: వ్యక్తిగత సమాచారం నమోదు చేసి, అవసరమైన పత్రాలు (ఫోటో, ప్యాన్ కార్డ్) అప్‌లోడ్ చేయాలి.

పథక ఎంపిక: ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌లలో తగిన విభాగాన్ని ఎంపిక చేసి, బ్యాంక్ లింక్డ్ లేదా నాన్-బ్యాంక్ లింక్డ్ పథకాన్ని ఎంచుకోవచ్చు.

ఈ పథకం ద్వారా యువతకు ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముంది. మీకు అర్హత ఉందా? వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Guidelines For Rajiv Yuva Vikasam Scheme Click Here

Also Read : Ration Card Status : మీ పేరు జాబితాలో ఉందా? ఇలా చెక్ చేసుకోండి

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

3 thoughts on “Rajiv Yuva Vikasam Scheme Telangana 2025: అప్లై చేసేవారు గమనించండి… మారిన నిబంధనలు ఇవే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *