rajiv yuva vikasam scheme details : నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదని నిరుత్సాహపడకండి

rajiv yuva vikasam scheme details : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం అనే నవీన పథకాన్ని తీసుకొస్తోంది. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు అందిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతికి ఆర్థికంగా చేయూతనిచ్చే దిశగా ముందడుగు వేసింది.
ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల యువతకు గరిష్ఠంగా రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం లభించనుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 6,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది.
rajiv yuva vikasam scheme details:
- నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు
- 5 లక్షల మందికి ఆర్థిక సహాయం
- అర్హులైన వర్గాలకు రూ. 4 లక్షల వరకు మద్దతు
- మొత్తం రూ. 6 వేల కోట్ల బడ్జెట్
- దరఖాస్తు ప్రక్రియ, యూనిట్ ఎంపిక, ఎంపిక విధానం త్వరలో వెల్లడికానుంది
ఎంత చదివినా ఉద్యోగం దొరకక పోతే నిరుత్సాహపడే యువతకు ఇది ఒక గొప్ప అవకాశంగా మారుతోంది. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మార్చి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ యువతకు ఇది ఆర్థికంగా స్ధిరత్వాన్ని అందించే, స్వయం ఉపాధికి దారితీసే మార్గంగా నిలవనుంది.
rajiv yuva vikasam scheme అంటే ఏంటి?
తెలంగాణలోని యువతకు స్వయం ఉపాధి మార్గాలు కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ప్రాధాన్య పథకం రాజీవ్ యువ వికాసం. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలను అందజేస్తారు.
ఈ పథకం కింద ప్రతి అర్హుడు రూ. 50,000 నుంచి రూ. 3 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 6,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించడం జరిగింది. ఒక్కో యూనిట్‌పై రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం నుండి 100 శాతం వరకు సబ్సిడీ ఇవ్వగా, మిగిలిన భాగాన్ని బ్యాంకు రుణం రూపంలో పొందే అవకాశం ఉంటుంది.
ఇంకా, ఎంపికైన అభ్యర్థులకు సంబంధిత రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేకంగా 15 రోజుల శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది ఉపాధికి ప్రాక్టికల్ గా సిద్ధం చేసే విధంగా ఉండనుంది.
rajiv yuva vikasam scheme కింద ఆర్థిక రాయితీ
యూనిట్ ఖర్చు | ప్రభుత్వ సబ్సిడీ | బ్యాంకు రుణం |
రూ.50,000ల వరకు | 100% | 0 |
రూ.50,001 నుంచి రూ.1,00,000 | 90% | 10% |
రూ.1,00,001 నుంచి రూ.2,00,000 | 80% | 20% |
రూ.2,00,001 నుంచి రూ.4,00,000 | 70% | 30% |
వల్నరబుల్ గ్రూప్స్‌కు రూ. లక్ష వరకు | 90% | (10% EMF) |
మైనర్ ఇరిగేషన్ | 100% | 0 |
rajiv yuva vikasam scheme యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు:
- రాష్ట్ర యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా మార్గనిర్దేశం చేయడం.
- యువత తమ స్వంత వ్యాపార యూనిట్లు, చిన్న పరిశ్రమలు ప్రారంభించేందుకు గరిష్ఠంగా రూ. 3 లక్షల వరకు ఆర్థిక సాయం అందించడం.
- ఈ పథకం ద్వారా సుమారు 5 లక్షల మంది యువతిని లబ్ధిదారులుగా చేయడం లక్ష్యం.
- ఉద్యోగాల కోసం ఎదురుచూసే పరిస్థితిని తొలగించి, యువతను ఉద్యోగ దాతలుగా మారేందుకు ప్రోత్సహించడం.
రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులెవరు?
- దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెలంగాణకు శాశ్వత నివాసిగా ఉండాలి.
- ఈ పథకం కేవలం నిరుద్యోగుల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- విద్యార్హతపై ఆధారపడకుండా, అన్ని అర్హులకూ రుణాలు మంజూరు చేస్తారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ మరియు మైనారిటీ వర్గాలకు చెందిన యువతీ యువకులు అర్హులు.
- గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం రూ. 1.5 లక్షల లోపు ఉండాలి; పట్టణాల్లో అయితే రూ. 2 లక్షల లోపు ఉండాలి.
- ఒక్క కుటుంబానికి కేవలం ఒకరికి మాత్రమే ఈ పథకం ద్వారా మద్దతు లభిస్తుంది. గతంలో కార్పొరేషన్ రాయితీ రుణం పొందినవారు, ఐదేళ్లు గడిచిన తర్వాత మాత్రమే మళ్లీ దరఖాస్తు చేసుకునే అర్హత పొందుతారు.
- దరఖాస్తుదారులు తమకు ఇష్టమైన యూనిట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అదే రంగంలో అనుభవం ఉన్నవారికి, నైపుణ్యాలు ఉన్నవారికి ఎంపికలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
- పథకం కింద ఉన్న వర్గాల్లో అత్యంత ఆర్థికంగా వెనుకబడిన వారికి మొదటిఆధిక ప్రాధాన్యం ఇస్తారు.
- వ్యవసాయ రంగంలో దరఖాస్తు చేసేవారి వయసు 21 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
- వ్యవసాయేతర రంగాల్లో దరఖాస్తు చేసేవారికి వయస్సు 21 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేయడానికి అవసరమైన డాక్యుమెంట్లు:
- ఆధార్ కార్డు – గుర్తింపు పత్రంగా తప్పనిసరి
- రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డు / ఆదాయ ధ్రువీకరణ పత్రం – కుటుంబ ఆదాయాన్ని నిరూపించేందుకు
- కుల ధ్రువీకరణ పత్రం – సంబంధిత కేటగిరీకి చెందినదని తెలియజేయడానికి
- బ్యాంకు అకౌంట్ పాస్‌బుక్ – ఆర్థిక సహాయం జమ చేయడానికై అవసరం
- వ్యవసాయ రంగంలో దరఖాస్తు చేస్తున్నవారికి పట్టాదార్ పాస్‌బుక్ తప్పనిసరి
- రవాణా రంగానికి సంబంధించినవారికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం
- బలహీన వర్గాల ధ్రువీకరణ పత్రం – మండల స్థాయి కమిటీచే ధ్రువీకరించబడినది
- దివ్యాంగులైతే సంబంధిత గుర్తింపు పత్రం (వికలాంగ ధ్రువీకరణ పత్రం)
- మొబైల్ నంబర్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో – తాజా చిత్రం అవసరం
ప్రధాన ఉపాధి అవకాశాలు:
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధికి తోడ్పడే విధంగా పలు రంగాల్లో యూనిట్ల ఏర్పాటు కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది. వ్యవసాయ రంగం మరియు వ్యవసాయేతర రంగాల్లో కలిపి సుమారు 300 కంటే ఎక్కువ ఉపాధి యూనిట్లు ప్రభుత్వ సూచనల ప్రకారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనవి కొన్ని ఇవే:
వ్యవసాయ అంశాలు
1. ఎద్దుల బండ్లు
2. ఆయిల్ ఇంజిన్
3. పంప్ సెట్
4. ఎయిర్ కంప్రెషర్
5. పత్తి సేకరణ యంత్రం
6. వేరుషనగ మిషన్
7. వర్మీ కంపోస్ట్
8. ఆయిల్ ఫామ్ పంట
పశుపోషణ:
1. గేదెలు
2. ఆవులు
3. డైరీ ఫారం
4. కోడిగుడ్ల వ్యాపారం
5. చేపల వ్యాపారం
6. మేకల పెంపకం
7. పాల వ్యాపారం
8. పౌల్ట్రీ ఫారం
9. గొర్రెల పెంపకం
సొంత వ్యాపారం:
- ఎయిర్ కూలర్ల వ్యాపారం
- స్టీల్ సామాన్ల వ్యాపారం
- ఆటోమొబైల్ షాపు
- బేకరీ షాపు
- గాజుల దుకాణం
- హెయిర్ కటింగ్ షాపు
- బుట్టల తయారీ షాపు
- బ్యూటీ పార్లర్ షాపు
- జనరల్ స్టోర్
- ఇటుకలు తయారీ వ్యాపారం
- డిష్ టీవీల ఏర్పాటు
- వడ్రంగి షాపు
- సీసీ కెమెరాల రిపేర్ షాప్
- ఎలక్ట్రిక్ షాపు
- ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ కేంద్రం వైరింగ్ కేంద్రం
- మగ్గం టైలరింగ్
- చెప్పులు అమ్మే దుకాణం
- పండ్ల వ్యాపార కేంద్రం
- పండ్ల రసాల దుకాణం
- బట్టల దుకాణం
- కిరాణం జనరల్ స్టోర్
- జనరేటర్ షాప్
- గిఫ్ట్ ఆర్టికల్ షాప్
- బంగారు నగల దుకాణం
- పిండి గిర్ని కేంద్రం
- హోటల్ ఏర్పాటు
- ఐస్ క్రీమ్ పార్లర్ ఏర్పాటు
- ఐరన్ బిజినెస్
- లేడీస్ కార్నర్
- లాండ్రీ షాపు డ్రై క్లీనింగ్
- పేపర్ ప్లేట్ల తయారీ
- లైట్స్ డెకరేషన్ సౌండ్ సిస్టం
- అగరబత్తుల తయారీ
- మినీ సూపర్ బజార్
- మెడికల్ అండ్ జనరల్ స్టోర్
- ఆటో టిఫిన్ సెంటర్
- మోటార్ మెకానిక్
- మోటార్ అండ్ పైప్ లైన్
- మటన్ షాపు
- పాన్ షాపు
- పేపర్ బ్యాగుల తయారీ
- ఫోటో అండ్ వీడియో షాపు
- పిండి గిర్ని
- ఫిల్టర్ వాటర్ కేంద్రం
- రెడీమేడ్ బట్టల దుకాణం
- చీరల వ్యాపారం
- స్లాబ్ కటింగ్ మిషన్
- స్ప్రే పెయింటింగ్ మిషన్
- స్టీల్ అండ్ సిమెంట్
- స్టిచింగ్ మిషన్
- సప్లయర్స్ షాపు
- మిఠాయిల షాపు
- టైలరింగ్
- వెల్డింగ్ షాపు
- వాటర్ సర్వీసింగ్ సెంటర్
- కూరగాయల వ్యాపార షాపు
- టిఫిన్ అండ్ టీ షాప్
- టీవీ మెకానిక్ షాప్
- సెల్‌ఫోన్ రిపేర్ షాప్
- సిమెంటు ఐరన్ షాపు
- సెంట్రింగ్ పరికరాల షాపు
- చెప్పుల తయారీ షాపు
- చికెన్ సెంటర్
- బట్టల వ్యాపారం
- కాఫీ హోటల్
- కాంక్రీట్ మిల్లర్స్ పరికరాలు
- కూల్ డ్రింక్ షాప్
- క్రేన్
- కర్రీస్ పాయింట్
- సైకిల్ మెకానిక్
- వ్యాధి నిర్ధారణ కేంద్రాల ఏర్పాటు
- డీజిల్ ఆటో
- డిజిటల్ కెమెరా షాపు
- సెటప్ బాక్స్‌ల ఏర్పాటు
- కూరగాయల దుకాణం
Also Read : Telangana Rajiv Yuva Vikasam Scheme 2025: అప్లై చేసేవారు గమనించండి… మారిన నిబంధనలు ఇవే!
One thought on “rajiv yuva vikasam scheme details : నిరుద్యోగ యువతకు ఉద్యోగం లేదని నిరుత్సాహపడకండి”