Pawan kalyan ‘హరి హర వీరమల్లు‘ కథపై స్పష్టత
పవర్ స్టార్ Pawan Kalyan నటించిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘హరి హర వీరమల్లు’ జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులు కాకుండా, పౌరాణిక కథలను ఆస్వాదించే ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.
అయితే, ఈ సినిమా కథ ఒక తెలంగాణ యోధుని జీవితాన్ని వక్రీకరించిందన్న ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మూవీ యూనిట్ స్పందించింది. వారు ఈ చిత్రం పూర్తిగా కల్పిత కథ అని స్పష్టంగా ప్రకటించారు. ఇది నిజమైన వ్యక్తి జీవితం ఆధారంగా కాదని, సనాతన ధర్మ పరిరక్షకుడి రూపంలో ఓ వీరుని గాథ మాత్రమేనని వివరణ ఇచ్చారు.
ఈ సినిమా ముఖ్యమైన విశేషం ఏమిటంటే – ఇందులో పవన్ కళ్యాణ్ శైవ-వైష్ణవ విలీన రూపంలో కనిపించబోతున్నారు. శివుడు మరియు విష్ణువు లక్షణాలు కలగలిసిన పాత్రగా పవన్ నటించడమంటేనే ఇది ఒక విధంగా సంస్కృతిక, ధార్మిక విలువలకి ప్రతినిధిగా మారిన పాత్ర అని చెప్పొచ్చు. ట్రైలర్‌లో డేగ (విష్ణువు వాహనం), డమరుకం (శివుడు ప్రతీక) వంటి చిహ్నాలతో పవన్ పాత్రను బలంగా తీర్చిదిద్దారు.
నిర్మాత ఏఎం రత్నం ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా ఐదేళ్లపాటు శ్రమించారు. భారీ బడ్జెట్, నాణ్యత కలిసిన విజువల్స్‌కి పాటు పవన్ కళ్యాణ్ సుదీర్ఘ విరామం తర్వాత థియేటర్లలో వస్తుండటంతో, ఓవర్సీస్, హిందీ హక్కులు తప్ప మిగిలిన హక్కులను అమ్మే ఉద్దేశం లేదని చెప్పేంత ధైర్యంగా ఉన్నారు. దీంతో నైజాంలో బయ్యర్ల మధ్య హక్కుల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది.
ఇక రాజకీయ దృష్టికోణంలోనూ పవన్ కళ్యాణ్ ఇటీవలి కాలంలో సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనని తాను నిలబెట్టుకున్నారు. తిరుమల లడ్డూ నెయ్యి వివాదం, మురుగన్ భక్తుల సభలో చేసిన ప్రసంగం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇదంతా సినిమా పట్ల ప్రజల్లో మరింత ఆసక్తిని పెంచింది.
ఈ సమస్త అంశాల మధ్య ‘హరి హర వీరమల్లు’ సినిమా పవన్ కళ్యాణ్‌కు గేమ్ ఛేంజర్ అయ్యే అవకాశాలున్నాయి. మునుపెన్నడూ చూడని పవన్ రూపాన్ని, భక్తి – ధర్మం – యుద్ధం మేళవింపును ఈ సినిమాలో చూడబోతున్నామని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి అభిమానుల ఊహలకు తగిన విధంగా ఇది నిలబడ్డుందా లేదా అన్నది జులై 24న తెలుసుకోవాల్సిందే!
Also Read : Bigg Boss 9 Telugu: కామన్‌మ్యాన్‌కి చాన్స్! ఇలా Bigg Boss 9కి రిజిస్టర్ చేసుకోండి