Mynampally Rohit Biography మైనంపల్లి రోహిత్ బయోగ్రఫీ

Mynampally Rohit ఒక ప్రముఖ వైద్యుడు, రాజకీయ నాయకుడు, సామాజిక సేవకుడు, వ్యాపారవేత్త మరియు ట్రావెల్ ఇన్‌ఫ్లూయన్సర్‌గా తెలంగాణ రాష్ట్రంలో తనదైన గుర్తింపు పొందారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఆయన ప్రజాసేవ కార్యక్రమాలను కార్యాచరణలోకి తెచ్చారు.
Mynampally Rohit Age, Date of Birth, Wife, Family
పేరు | మైనంపల్లి రోహిత్ రావు |
జన్మతేది | 1 నవంబర్1997 |
వయసు | 27 |
జన్మస్థలం | హైదరాబాద్ |
తల్లిదండ్రులు | మైనంపల్లి వాణి, మైనంపల్లి హన్మంతరావు |
జీవిత భాగస్వామి | శివాని రెడ్డి |
సంతానం | మైనంపల్లి క్రియాంష్ |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
విద్య | MBBS – MediCiti Institute of Medical Sciences |
వృత్తి | డాక్టర్, రాజకీయ నాయకుడు, సామజిక సేవకుడు, వ్యాపారవేత్త, ట్రావెల్ ఇన్‌ఫ్లూయన్సర్ |
నియోజకవర్గం | మెదక్ |
Click Here | |
Click Here |
మైనంపల్లి రోహిత్ date of birth నవంబర్ 1, 1997. ఆయన హైదరాబాద్‌లో మైనంపల్లి హన్మంతరావు, వాణి దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే విద్యపై ఆసక్తి కనబర్చిన రోహిత్, మేడ్చల్‌లోని ప్రతిష్ఠాత్మక మెడిసిటీ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. ఎంబిబిఎస్ చదువు పూర్తి చేసే సమయంలో ఆయన ఇద్దరు విద్యార్ధులకు మాత్రమే లభించే రెండు బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. మైనంపల్లి రోహిత్ విద్యా ప్రస్థానం ఆయన దీర్ఘకాలిక సామాజిక సేవల ఆశయానికి బలమైన పునాదిగా నిలిచింది.
Mynampally Rohit Wife

Mynampally Rohit Political Career
మైనంపల్లి రోహిత్ తన సేవాభావాన్ని సామాజిక కార్యాచరణగా మార్చుకుంటూ ‘మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్’ అనే సేవా సంస్థను స్థాపించారు. కరోనా మహమ్మారి సమయంలో అనేక నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడమే కాక, నిత్యావసర సరుకులు, ఔషధాలు కూడా పంపిణీ చేశారు. ప్రజల్లో నమ్మకాన్ని చూరగొన్న ఆయన, 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) అభ్యర్థిగా బరిలోకి దిగారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత పద్మా దేవేందర్ రెడ్డిపై 10,157 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి, తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
2 thoughts on “Mynampally Rohit Biography మైనంపల్లి రోహిత్ బయోగ్రఫీ”