Mynampally Hanumanth Rao Biography మైనంపల్లి హన్మంతరావు బయోగ్రఫీ

Mynampally Hanumanth Rao
మైనంపల్లి హనుమంతరావు గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు. ఈయన 2018లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
Mynampally Hanumanth Rao Age, Date of Birth, Family
పేరు | మైనంపల్లి హన్మంతరావు |
జననం | 10 జనవరి 1966 |
వయసు | 59 |
పుట్టిన ప్రదేశం | కొర్విపల్లి, మెదక్ జిల్లా |
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
నియోజకవర్గం | మల్కాజ్‌గిరి |
తండ్రి | కిషన్ రావు |
తల్లి | సరోజినీ |
జీవిత భాగస్వామి | వాణి |
సంతానం | మైనంపల్లి రోహిత్, మైనంపల్లి శివాంక్ |
విద్య | యూ.ఎస్ లోని అలబామా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి |
Mynampally Hanumanth Rao Political Career
1998లో మైనంపల్లి హన్మంతరావు గారు తెలుగుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చారు.
2008 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మైనంపల్లి హనుమంతరావు 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశిధర్ రెడ్డి పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన మెదక్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా కూడా పనిచేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి నియోజకవర్గం టిడిపి టికెట్ ఆశించారు, అయితే 2014 ఎన్నికల్లో తెలుగుదేశం మరియు బిజెపి పొత్తుతో భాగంగా ఆయనకు టికెట్ దక్కకపోవడంతో 2014 ఏప్రిల్ ఆరవ తేదీన హన్మంతరావు గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు . ఏప్రిల్ 8 2014న కాంగ్రెస్ పార్టీలో చేరారు, కానీ అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో హన్మంతరావు గారు 8 ఏప్రిల్ 2014న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.
2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి సిహెచ్ మల్లారెడ్డి పై ఓటమిపాలయ్యారు. ఏప్రిల్ 21 2017 లో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్ రామచందర్రావు పై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా గెలవడంతో డిసెంబర్ 12 2018 న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
సంవత్సరం | నియోజకవర్గం | పార్టీ | పోటీ పడ్డారు | ఓట్లు ఫలితాలు |
2008 | రామాయంపేట | తెలుగుదేశం పార్టీ | ఎం ల్ ఏ | గెలుపు |
2009 | తెలుగుదేశం పార్టీ | ఎం ల్ ఏ | గెలుపు | |
2014 | మల్కాజ్గిరి | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ఎం పి | ఓటమి |
2015 | గ్రేటర్ హైదరాబాద్ | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా | గెలుపు |
2017 | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ఎమ్మెల్సీ | గెలుపు | |
2018 | మల్కాజ్గిరి | ఎం ల్ ఏ | గెలుపు |
మైనంపల్లి హనుమంతరావు గారు 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మల్కాజ్గిరి నియోజకవర్గం మరియు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ సీట్లు అడిగారు. 2023 ఆగస్టు 21న భారత రాష్ట్ర సమితి పార్టీ ఒకటే టికెట్ కేటాయించడంతో , మైనంపల్లి హనుమంతరావు గారు పార్టీ అధిష్టానం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండి సెప్టెంబర్ 22 2023న భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సెప్టెంబర్ 28 2023 ఢిల్లీలోని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మైనంపల్లి హన్మంతరావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, 2023 అక్టోబర్ 15 న మొదటి జాబితా 55 మంది అభ్యర్థుల లిస్టుని విడుదల చేయగా అందులో ఆయనకు మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం మరియు ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు మెదక్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఇచ్చారు.
3 thoughts on “Mynampally Hanumanth Rao Biography మైనంపల్లి హన్మంతరావు బయోగ్రఫీ”