పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర Ponguleti Srinivas Reddy Biography

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర Ponguleti Srinivas Reddy Biography

పరిచయం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు మరియు మాజీ లోక్సభ సభ్యుడు. 2014 నుండి 2019 వరకు ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి 16వ లోక్సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత పరిచయం

పేరుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జననంనవంబరు 4, 1959
పుట్టిన ప్రదేశంనారాయణపురం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
తండ్రిరాఘ‌వ‌రెడ్డి,
తల్లిస్వ‌రాజ్యం
జీవిత భాగస్వామిమాధురి
సంతానంకుమారుడు (హర్షారెడ్డి), కుమార్తె (సప్ని).
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
నియోజకవర్గం ఖమ్మం లోకసభ నియోజకవర్గం
విద్యఉస్మానియా యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో బిఏ డిగ్రీ

తొలి రాజకీయ జీవితం

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ మరియు వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. 2014లో జరిగిన 16వ లోక్సభ ఎన్నికలలో ఆ పార్టీ తరఫున ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పై 11, 974 ఓట్ల మెజారిటీతో గెలుపొంది, తర్వాత టిఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో మరియు 2019 17వ లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం లో పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న భారత రాష్ట్ర సమితి పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఆయన 2023 జూలై రెండు న ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి , కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్గా నియమితులయ్యారు.

సీతక్క జీవిత చరిత్ర

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

3 thoughts on “పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవిత చరిత్ర Ponguleti Srinivas Reddy Biography

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *