వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

Manohar Parrikar: అసాధారణ నాయకత్వానికి ఓ నివాళి

On: March 18, 2025 3:26 AM
Follow Us:
Manohar Parrikar

Manohar Parrikar గారి నిజాయితీ, సాధారణ జీవన శైలి, దేశ సేవా తపన, మరియు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం గురించి తెలుసుకోండి.

ఓక గొప్ప వ్యక్తిని కోల్పోయిన దేశం …. అది గోవా పనాజీ ప్రాంతం….

ఒక యాభై సంవత్సరాల వయస్సు వ్యక్తి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర హెల్మెట్ పెట్టుకొని స్కూటర్ పై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు  చూస్తున్నాడు…ఇంతలో వెనక నుంచి 25 సంవత్సరాల యువకుడు కారుతో పదే పదే హారన్ కొడుతున్నాడు పక్కకు తప్పకో అని .స్కూటర్ పైనున్న వ్యక్తి అదేం పట్టించుకోవట్లేదు.వెంటనే కారులోని యువకుడు కిందకి దిగి నేనెవరినో తెలుసా నీకు ఈ ప్రాంత DSP కొడుకుని నాకే దారి ఇవ్వవా అని ఆ వ్యక్తితో వాదులాటకు దిగాడు. వెంటనే ఆ వ్యక్తి సున్నితంగా నవ్వుతూ బాబూ…నువ్వు DSP కొడుకు వైతే నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అని బదులిచ్చాడు…ఆ వ్యక్తి ఎవరో కాదు…..అప్పటి  గోవా ముఖ్యమంత్రి ,నిన్నటి వరకు దేశ రక్షణ మంత్రి,మళ్ళి ఇప్పుడు ముఖ్యమంత్రి…Manohar Parrikar

మనొహర్ పారికర్ గారు రక్షణ శాఖా మంత్రి కాక ముందు వరకు మన భారత రక్షణ దళాలకు ప్రత్యేక పరిస్తితులలొ వాడే ప్రత్యేక మైన shoes ను ఒక్కొక్క జత షూ  25,000 రూపాయల చొప్పున   ఇజ్రాయిల్ నుండి దిగుమతి చేసుకునేవారు …మనొహర్ పారికర్ గారు రక్షణశాక భాద్యతలు స్వీకరించిన తరువాత ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలిస్తున్న పారికర్ గారు shoes ను 25,000 రూపాయలకు కొనుగొలు చేయడం చూసి, వాటిని దిగుమతి చేసుకొవడానికి బదులు భారత్ లొనే తయారుచేయించాలని భావించారు

అయన ఈ shoes గురించి వాకబు చేయడంతొ బిత్తరపొయే అంశాలు వెలుగులొకి వచ్చాయి …అ shoes ను తయారు చేస్తుంది భారత్ లొని రాజస్థాన్ లొనే…అవి ఇక్కడే తయారై ఇక్కడి నుండి ఇజ్రయిల్ వెళ్ళి మరలా అక్కడి నుండి మనం వాటిని అధిక ధరలకు కొనుగొలు చేస్తున్నామని తెలియడంతొ ఆశ్చర్యపొయిన పారికర్ గారు, వెంటనే ఆ కంపెనీ తొ కుదుర్చుకు రమ్మని రక్షణశాఖాధికరులను ఆదేశించారు….

అయితే సమయానికి డబ్బులు చెల్లించరని, బిల్లులు త్వరగ పాస్ కావని భారత రక్షణశాఖ తొ వొప్పందానికి ఆ కపెనీ యాజమాన్యం అంగీకరించకపొవడంతొ, మనొహర్ పారికర్ గారు స్వయంగా తనే యాజమాన్యాన్ని కలుసుకుని డబ్బు చెల్లింపులలొ ఒక్క రొజు ఆలస్యమైనా తనకు ఫొను చేయమని తన వ్యక్తిగత ఫొన్ నంబర్ యిచ్చి ఒక్కొక్క జత షూస్ 2200 లకు అందించేలా వొప్పందం కుదుర్చుకున్నారు ….మనం ఇజ్రాయిల్ నుండి 25,000 కు దిగుమతి చేసుకుంటున్న షూస్ ను కేవలం 2200 కే అందించడానికి కంపెనీ యాజమాన్యం అంగీకరించింది..

మనొహర్ పారికర్ గారి పనితనం ఏలా ఉంటుందొ చెప్పడనికి ఇదొక ఉదాహరణ

దేశంలోనే భూతద్దం పెట్టి నా దొరకరు ఇలాంటి common life ఉన్న ముఖ్యమంత్రి..చిన్న చిన్న  సర్పంచ్, MPTC పదవులు ఉన్నా పెద్ద పెద్ద బిల్డప్( షోపుటప్ లు) లు ఇచ్చే ఈ కాలంలో ….ఒక వ్యక్తి కొరకు రాష్ట్రం, కెంద్రం డిమాoడ్ చేయటం చూస్తుంటే ఆయన నిజాయితీ ఏ పాటిదో అర్థమౌతుంది.ఆయనే మనోహర్ పారికర్ అదే నిజాయితికి గల వ్యక్తికి ఉన్న గుర్తింపు…

మనోహర్ పారికర్

మనొహర్ పారికర్ రక్షణ మంత్రిగా రాజీనామా చేయడం అనేది జీర్ణించుకొవడానికి చాలా కష్టంగా ఉంది. అసలు ఊహించని పరిణామం. నా జీవితంలొ ఇంత గొప్ప రక్షణ మంత్రిని ఇంతవరకు చూడలేదు. ఇంత వరకు పనిచేసిన డిఫెన్స్ మినిస్టర్లలొ పారికర్ గారు ఎవరెస్టు లాంటివారు. కేవలం రెండు సంవత్సరాలలొ అనేక మార్పులు, సంస్కరణలు తీసుకువచ్చారు. నిజంగ ఈ వార్త తట్టుకొవడం చాలా కష్టమే…

గోవా ముఖ్యమంత్రి మనోహరు పారికర్ గారి వ్యక్తిత్వం

  • ఒక సామాన్య ముఖ్య మంత్రి.
  • అసెంబ్లీ కి స్కూటర్ మీద వెళతారు.
  • ప్రోటోకాల్ ఉండదు.
  • పోలీస్ కేస్ లలో జోక్యం ఉండదు
  • ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ని కేంద్ర ప్రభుత్వం మంత్రి పదవి ఇచ్చి రమ్మంది.
  • ఒక ముఖ్య మంత్రి తమ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రిగా వెళుతున్నారంటే సంతోషించే వారే కదా ప్రజలు.
  • ఆయన్ని గోవా ముఖ్యమంతి పదవికి రాజీనామా చేసి కేంద్ర రక్షణ మంత్రి బాధ్యతలు స్వీకరించమని కోరినపుడు యావత్ గోవా కంట తడి పెట్టింది.
  • రాజకీయ నాయకులు అంటేనే అసహ్యం జుగుప్స ఉన్న ఈ రోజుల్లో తమ నాయకుడు తమని వదిలి కేంద్రానికి వెళుతున్నారంటే ప్రజలు కన్నీరు పెట్టారంటే ఆయన ఎంత పెద్ద నాయకుడో ఇట్టే చెప్పొచ్చు.
  • ట్రాఫిక్ జాం ఐతే కార్ దిగేసి స్కూటెర్ పై ఉన్న వాడిని లిఫ్ట్ అడిగెస్తాడు. బడ్డీ కొట్టు లో టీ తాగేస్తాడు. ఫుట్ పాత్ పై ఉన్న బజ్జీలు తింటాడు. అదేమిటి అని అడిగితే మన పాలన గురించి బడ్డీ కొట్టు లో తెలిసినంత మరెక్కడా తెలీదు అని చిరునవ్వుతో సమాధానం ఇస్తాడు.
  • గోవా ముఖ్య మంత్రిగా ఒక కాన్ఫరెన్స్ కి హాజరు కావాల్సి ఉంది కార్ ఆగింది. ఒక వ్యక్తి దిగి ఒక చేత్తో బాగ్ మరో చేత్తో ఫైల్స్ మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెనక సెక్యూరిటీ వచ్చారు ఎక్కడ గోవా ముఖ్య మంత్రి అని వారిని అడిగితే అదిగో ఫైల్స్ మోసుకెళుతున్న వ్యక్తే మా ముఖ్యమంత్రి అని చెప్పరాట సెక్యూరిటీ.
  • తీరా లోపలికెళ్లాక ఆ స్టార్ హోటెల్ గేట్ వద్ద ఉన్న వ్యక్తి ఎవరు మీరు లోపలికి వెళుతున్నారు అని ఆపేశారట వెనక నుండి సెక్యూరిటీ వచ్చి మా ముఖ్య మంత్రి అని చెబితే  అవాక్కయ్యాడట.
  • అంతటి మంచి వ్యక్తి తమ రాష్ట్రం నుండి వెళుతుంటే బాధ తో కన్నీరు పెట్టారంటే నమ్మలేము ఆ వ్యక్తి ఎంతటి ధనికుడో మీరే చెప్పాలి.
  • అత్యంత పేద కుటుంబం నుండి వచ్చి IIT పట్టా పొందిన పారికర్.

మనకు ఇటువంటి నాయకులు కావాలి. కోట్లకు కోట్లు దోచుకొనే నాయకులు కాదు. ప్రజాస్వామ్యమంటే సెక్యూరిటీ గార్డులను వెనకేసుకొని తిరిగేవారు కాదు …..

Also Read : బీసీలకు గుడ్ న్యూస్: సీఎం కీలక ప్రకటన

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “Manohar Parrikar: అసాధారణ నాయకత్వానికి ఓ నివాళి”

Leave a Comment