26 Apr 2025, Sat

Jagadish Reddy Biography జగదీష్ రెడ్డి

Jagadish Reddy

గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు రాష్ట్ర మంత్రివర్గ సభ్యుడు. 2014, జూన్ 2న ఆయన తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన జగదీష్ రెడ్డి, రాష్ట్ర తొలి విద్యాశాఖ మంత్రిగా (2014-2016) సేవలందించారు. 2016 నుండి విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు.

Jagadish Reddy Age, Date of Birth, Family

పేరుగుంటకండ్ల జగదీష్ రెడ్డి
జన్మతేది18 జూలై 1965
జన్మస్థలంనాగారం ,నాగారం మండలం, సూర్యాపేట జిల్లా
వయసు60
తండ్రిగుంటకండ్ల రామచంద్రారెడ్డి
తల్లిగుంటకండ్ల సావిత్రి దేవి
జీవిత భాగస్వామి సనీతారెడ్డి
సంతానం వేమన్ రెడ్డి, లహరి రెడ్డి
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
వృత్తి   రాజకీయ నాయకుడు
విద్యశ్రీ వెంకటేశ్వర్ డిగ్రీ కళాశాల నుండి బిఏ పట్టభద్రుడయ్యారు. విజయవాడలోని సిద్దార్థ లా కాలేజీ (నాగార్జున యూనివర్సిటీ) నుండి బ్యాచిలర్ ఆఫ్ లా చేసారు
Twitterhttps://x.com/jagadishBRS
Facebookhttps://www.facebook.com/jagadishreddyguntakandla/
Instagramhttps://www.instagram.com/jagadishreddyguntakandla

జగదీష్ రెడ్డి 1965, జూలై 18న తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా, అర్వపల్లి మండలంలోని నాగారం గ్రామంలో గుంటకండ్ల రామచంద్రారెడ్డి మరియు సావిత్రి దేవి దంపతులకు జన్మించాడు. ఆయనకు నలుగురు సహోదరులు ఉన్నారు. 1985లో సూర్యాపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల (ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధం) నుండి బీఏ డిగ్రీను పూర్తి చేశాడు. అనంతరం విజయవాడలోని సిద్దార్థ లా కాలేజీ (నాగార్జున యూనివర్సిటీ) నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పట్టా పొందాడు.

లా డిగ్రీ పూర్తి చేసిన అనంతరం, ఆయన నల్గొండ జిల్లా కోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించాడు. నల్గొండ జిల్లా మొదటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సేవలందించాడు.

guntakandla Jagadish Reddy Family Photos

guntakandla Jagadish Reddy Political Career

తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న జగదీష్ రెడ్డి, 2001లో స్థాపితమైన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో ప్రారంభ సభ్యులలో ఒకరిగా చేరారు. ఆయన విద్యార్థి సంఘ నాయకుడిగా కూడా సేవలందించాడు. 2001లో సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జిగా నియమించబడిన ఆయన, సిద్దిపేట ఉప ఎన్నికల ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

2002లో, జలసాధన కోసం ఆలంపూర్ నుంచి ఆర్డీఎస్ వరకు 45 రోజుల పాటు జరిగిన మహబూబ్‌నగర్ పాదయాత్రకు ఆయన ఇంచార్జిగా వ్యవహరించారు. 2003లో మెదక్ జిల్లాలో బాధ్యతలు నిర్వహించగా, 2004లో సిద్దిపేట ఉప ఎన్నికల్లో ఇంచార్జిగా వ్యవహరించి టి. హరీష్ రావు విజయానికి కృషి చేశారు. 2005లో సదాశివపేట మున్సిపల్ ఎన్నికలకు, 2006లో కరీంనగర్ లోక్‌సభ ఉప ఎన్నికలకు, 2008లో ముషీరాబాద్, ఆలేరు నియోజకవర్గాల ఉప ఎన్నికలకు, మెదక్ జిల్లాకు ఇంచార్జిగా పనిచేశారు.

2009లో హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన, ఆ తర్వాత 2009లో సూర్యాపేట నియోజకవర్గానికి, 2011లో బాన్సువాడ ఉప ఎన్నికలకు, 2012లో కొల్లాపూర్, పరకాల ఉప ఎన్నికలకు, 2013లో నల్గొండ జిల్లా బాధ్యతలకు ఇంచార్జిగా వ్యవహరించారు.

తెరాస రాష్ట్ర కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేసిన జగదీష్ రెడ్డి, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట శాసనసభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలుపొందారు.

జగదీష్ రెడ్డికి ఎస్సీ అభివృద్ధి శాఖ మరియు సహకార శాఖల బాధ్యతలను అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు అప్పగించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత, ఆయన కెసీఆర్ తొలి మంత్రివర్గంలో విద్యా శాఖ (2014-2015) మరియు అనంతరం విద్యుత్ శాఖ (2016-2018) మంత్రిగా పనిచేశారు. 2019లో కెసీఆర్ రెండవ మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *