వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు

On: May 11, 2025 10:15 AM
Follow Us:
Gold Price Today

Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి ఈ రోజు చేదు అనుభవం ఎదురైంది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి రేట్లు మే 11న అనూహ్యంగా మళ్లీ పెరిగాయి. మరోసారి ధరలు పడిపోతాయని ఆశించిన వారికి ఇది షాక్‌లాంటి విషయం. బంగారం రేట్లు మళ్లీ పైకి వెళ్లడంతో మార్కెట్‌లో వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం మరియు వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్లకు బంగారం అంటే ప్రత్యేకమైన ప్రేమ

బంగారం భారతీయులకి అంతర్భాగంగా మారింది. ముఖ్యంగా మహిళలు కొత్తనవి, మోడ్రన్ డిజైన్లలో బంగారు ఆభరణాలను ఇష్టపడతారు. పెళ్లిళ్లు, పండుగలు, శుభకార్యాల్లో పసిడి ప్రత్యేక స్థానం పొందుతుంది. అందుకే బంగారం విక్రయ కేంద్రాలు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తాయి.

ఇటీవలి కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఒక దశలో తులానికి ధర లక్ష రూపాయల మార్కును అధిగమించింది. అయితే ఆ తరువాత అమెరికా-బ్రిటన్ మధ్య వ్యాపార ఒప్పందాలు, చైనాపై సుంకాల్లో తగ్గింపు, ఫెడ్ వడ్డీ రేట్ల మార్పులు లాంటి అంశాల ప్రభావంతో ధరలు దిగివచ్చాయి. కానీ ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.

అంతర్జాతీయంగా కూడా రేట్ల పెరుగుదల

అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $3,325 వద్దకు చేరగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు $32.74 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే రూ.85.493 వద్ద ఉంది.

హైదరాబాద్‌లో బంగారం ధరల పరిస్థితి

ఇక్కడ స్థానిక బులియన్ మార్కెట్లో కూడా ధరలు పెరిగాయి. నిన్న తులానికి సుమారు రూ.1,250 తగ్గిన ధర ఈరోజు స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులానికి రూ.330 పెరిగి, 10 గ్రాములకు ₹98,680కి చేరుకుంది. అదే 22 క్యారెట్ల ధర రూ.300 పెరిగి 10 గ్రాములకు ₹90,450గా ఉంది.

వెండి ధరలు మాత్రం మారలేదు

బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నా, వెండి రేటు మాత్రం గత నాలుగు రోజులుగా స్థిరంగా ఉంది. ఈరోజు కూడా కిలో వెండి ధర ₹1,11,000 వద్ద కొనసాగుతోంది.

ఈ రోజు బంగారం ధరలు

S.NO22 క్యారెట్లు/ per gram24 క్యారెట్లు/ per gram
హైదరాబాద్‌9,045/-9,868/-
విజయవాడ9,045/-9,868/-
ముంబై9,045/-9,868/-
చెన్నై9,045/-9,868/-

ఈ రోజు వెండి ధరలు

S.NOper Gramper 1000 grams
హైదరాబాద్‌111/-1,11,000/-
విజయవాడ111/-1,11,000/-
ముంబై99/-99,000/-
చెన్నై111/-1,11,000/-

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

2 thoughts on “Gold Price Today : ఈ రోజు బంగారం ధరలు”

Leave a Comment