ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, రాబోయే సంవత్సరాల్లో ఇవి భారీగా పడిపోవచ్చన్న సంచలన నివేదికను మార్నింగ్‌స్టార్ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 3,160 డాలర్లకు చేరిన వేళ, భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 94,000 కు చేరాయి.
అయితే, అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ మార్నింగ్‌స్టార్ అభిప్రాయం ప్రకారం, దీర్ఘకాలంలో బంగారం ధరలు దాదాపు తులానికి రూ.55,000 వరకు పడిపోవచ్చు. అంటే ఇది ఇప్పటి ధరతో పోలిస్తే సుమారు 40 శాతం తగ్గుదల అన్నమాట.
ధరల పతనానికి ప్రధాన కారణాలు:
- బంగారం తవ్వకాలు (మైనింగ్) పెరగడం వల్ల సరఫరా పెరగడం
- అమెరికా ఆర్థిక వ్యవస్థలో స్థిరత, వడ్డీ రేట్ల పెంపు
- భౌతిక బంగారం కంటే గోల్డ్ ETF లపై పెట్టుబడులు పెరగడం
- ప్రపంచ కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను తగ్గించుకోవచ్చన్న అంచనా
ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల విధానం కారణంగా బంగారం సురక్షితమైన పెట్టుబడిగా మారింది. కానీ ఇది తాత్కాలికమని, భవిష్యత్‌లో తగ్గిన బంగారం ధరలు నమోదవుతాయని జాన్ మిల్స్ పేర్కొన్నారు.
తులం బంగారం ఎంత?:
ప్రస్తుతం మార్కెట్‌లో తులం బంగారం ధర రూ. 92,000 నుంచి రూ. 94,000 మధ్య ఉందగా, రాబోయే కాలంలో ఇది రూ. 55,000 వరకు పడిపోవచ్చని అంచనా.
పెట్టుబడిగా బంగారం మంచిదేనా?
దీర్ఘకాలం పెట్టుబడిగా బంగారం ఎంచుకునే వారు, తాజా మార్కెట్ ట్రెండ్‌ను గమనించి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పతన ధరల సమయంలో కొనుగోలు చేయడం వ్యూహాత్మకంగా ఉండొచ్చు.
Also Read : ఈ రోజు బంగారం ధరలు: 22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల గోల్డ్ రేట్స్ – ప్రధాన నగరాల వివరాలు