దీపావళి తర్వాత బంగారం ధరల్లో పెద్ద షాక్..! పెట్టుబడిదారులు ఆందోళనలో
గ్లోబల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడిపోవడంతో దేశీయంగా కూడా ఈ రెండు విలువైన లోహాలు తగ్గుముఖం పట్టాయి. దీపావళి పర్వదినం సందర్భంగా మంగళవారం జరిగిన ముహూర్తం ట్రేడింగ్‌లో MCXలో బంగారం, వెండి ధరలు తగ్గాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు ప్రస్తుతం ‘రిస్క్-ఆన్’ మోడ్‌లోకి వెళ్లి స్టాక్ మార్కెట్లపై ఎక్కువ దృష్టి పెడుతుండటంతో సేఫ్ హేవెన్‌గా భావించే బంగారం, వెండి పై డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో న్యూయార్క్ కోమెక్స్‌లో మంగళవారం బంగారం ధర 4.6% వరకు తగ్గింది. వెండి ధర మరింత తీవ్రంగా పడిపోవడంతో రోజువారీగా 7% వరకు తగ్గి ఔన్స్‌కు $47.8 వద్ద ట్రేడ్ అయింది. గత వారం రికార్డు స్థాయి $53.3 నుంచి ఇది గణనీయంగా పడిపోయింది. అదే సమయంలో MCXలో డిసెంబర్ డెలివరీ బంగారం ఫ్యూచర్స్ రూ.271 తగ్గి 10 గ్రాములకు రూ.1.3 లక్షల వద్ద ట్రేడ్ అయింది.
చెన్నై మార్కెట్‌లో కూడా దీపావళి తర్వాత బంగారం కొనుగోలు కొంత మందగించింది. పండుగల కాలం ముగియడంతో ‘gold rate today ’ లో స్వల్ప తగ్గుదల నమోదైంది. మార్కెట్ నిపుణులు బంగారం ధరలు తాత్కాలికంగా తగ్గినా దీర్ఘకాలంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారంలో ఆసక్తి చూపే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పులు, డాలర్ విలువ వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. ప్రస్తుతం చెన్నైలో 22 క్యారట్ బంగారం ధర తగ్గడం వల్ల ఆభరణాల కొనుగోలు దారులకు ఇది అనుకూల సమయం అని వ్యాపారులు పేర్కొన్నారు.
