Frozen shoulder నొప్పికి ఉత్తమ చికిత్స ఏమిటి? causes, phases, symptoms తెలుసుకోండి. Healio RegenX లో Dr Kartheek Telagareddy & Dr Bhargavi Rayapureddy అందించే advanced treatment.
Frozen Shoulder అంటేఏమిటి?
Causes, Symptoms, Phases & Best Treatment Options Explained in Telugu.
చేతిని పైకి ఎత్తలేకపోవడం, వెనక్కి తీసుకెళ్లలేకపోవడం, రాత్రి నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలు ఉంటే అది సాధారణ shoulder pain కాదు. చాలామంది ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తారు, కానీ ఇది ఫ్రోజెన్ షోల్డర్ (Adhesive Capsulitis) కావచ్చు.
ఫ్రోజెన్ షోల్డర్ అనేది Shoulder joint కదలికలు క్రమంగా తగ్గిపోవడం, జాయింట్ కఠినంగా మారిపోవడం వల్ల ఏర్పడే సమస్య. మెడికల్‌గా దీనిని Adhesive Capsulitis అని పిలుస్తారు. షోల్డర్ జాయింట్ చుట్టూ ఉండే సన్నని పొరను Capsule అంటారు. ఈ క్యాప్సూల్‌లో వాపు (inflammation) వచ్చి, అది గట్టిగా మారినప్పుడు జాయింట్ సరిగా కదలదు.
Frozen Shoulder Causes – ఎందుకువస్తుంది?
ఫ్రోజెన్ షోల్డర్ ఏర్పడే మెకానిజం ఇలా ఉంటుంది:
- షోల్డర్ క్యాప్సూల్‌కు ఏదైనా కారణంగా నష్టం
- దాంతో Inflammation రావడం
- క్యాప్సూల్ గట్టిగా (tight) మారడం
- Shoulder joint movements restrict అవడం
Diabetes ఉన్న వారిలో ఫ్రోజెన్ షోల్డర్ ఎందుకు ఎక్కువ?
డయాబెటిస్ ఉన్నవారిలో ముఖ్యంగా uncontrolled diabetes ఉంటే,
AGEs (Advanced Glycation End Products) అనే మాలిక్యూల్స్ ఏర్పడతాయి.
ఇవి:
- క్యాప్సూల్‌లోని collagen ను డ్యామేజ్ చేస్తాయి
- వాపు, కఠినత పెంచుతాయి
- ఫ్రోజెన్ షోల్డర్ severity ఎక్కువ చేస్తాయి
అందుకే Frozen Shoulder in diabetics చాలా కామన్.
ఎవరికీ ఫ్రోజెన్ షోల్డర్ వచ్చేఅవకాశంఎక్కువ?
ఈ కేటగిరీలో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి:
- 40 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు
- మహిళలు (women are more prone)
- Diabetes patients
- Shoulder surgery తర్వాత
- చిన్న గాయాల తర్వాత షోల్డర్ కదలికలు తగ్గించినవారు
Frozen Shoulder Phases – మూడుదశలు
ఫ్రోజెన్ షోల్డర్ సాధారణంగా 3 stages లో ముందుకు సాగుతుంది.
Freezing Phase
- తీవ్రమైన shoulder pain
- రాత్రి నిద్ర పట్టకపోవడం
- కదలికలు క్రమంగా తగ్గిపోవడం
- Duration: 6–9 నెలలు (కొన్నిసార్లు 12 నెలలు)
Frozen Phase
- నొప్పి కొంత తగ్గుతుంది
- కానీ shoulder movement పూర్తిగా restrict అవుతుంది
- Duration: 6–9 నెలలు
Thawing / Recovery Phase
- నొప్పి దాదాపుగా తగ్గిపోతుంది
- కదలికలు నెమ్మదిగా తిరిగి వస్తాయి
- Duration: 1–2 సంవత్సరాలు
Frozen Shoulder Symptoms – ముఖ్యలక్షణాలు
- Shoulder pain at rest and night
- చేతిని పైకి ఎత్తలేకపోవడం
- వెనక్కి తీసుకెళ్లలేకపోవడం
- రోజువారీ పనుల్లో ఇబ్బంది
- Dressing, combing hair కష్టంగా మారడం
Frozen Shoulder Treatment Options
1.Basic Treatment
- Pain killers
- Anti-inflammatory medicines
- Initial rest
2.Physiotherapy
- Shoulder mobility exercises
- Muscle strengthening
- Range of motion improvement
- Pain control అయిన తర్వాత physiotherapy చాలా ముఖ్యము
3.Steroid Injections
- Severe pain ఉన్నప్పుడు
- Inflammation తగ్గించడానికి
- Early stages లో మంచి ఫలితం
4.Advanced Treatment at Healio RegenX – Smart Approach
Healio RegenX లో మేము traditional treatments కన్నా ముందుకు వెళ్ళాము.Direct ga surgery ki వెళ్లకుండా, మేము advanced technology use చేసి మీ Frozen Shoulder problem కి root cause ని identify చేస్తాం.
Specialized diagnostic scans ద్వారా, మీ shoulder joint లోపల exact గా pain & stiffness కి reason ఏంటి అనేది clear గా analyze చేస్తాం. ఈ accurate diagnosis base చేసుకొని, మేము minimally invasive fine needle technique ద్వారా direct గా problem ఏరియా ని target చేసి treatment ఇవ్వడం జరుగుతుంది.
Key Benefits
- Major surgery అవసరం లేదు.
- Significant side effects ఉండవు.
- Targeted treatment approach.
- Fast pain relief పొందవచ్చు.
- Shoulder mobility improve అవుతుంది.
మన goal ఏంటంటే pain తగ్గించడం మాత్రమే కాదు — మీ overall quality of life ని improve చెయ్యడం.
Doctor’s Note
“మొదటి గా, advanced diagnostic tools use చేసి మీ problem కి exact cause ని identify చేస్తాను. తర్వాత, safe & effective treatment ని provide చేస్తాను — major side effects లేకుండా. నా aim ఏంటి అంటే మీ pain ని immediate గా reduce చేసి, మిమ్మల్ని fast గా normal life కి తీసుకెళ్లడం.”
Advanced Treatments for Frozen Shoulder
1.Hydro Dissection
- Needle ద్వారా capsule లో fluid పంపించడం
- Capsule tightness తగ్గుతుంది
- Non-surgical treatment option
2.Arthroscopic Adhesiolysis
- Key-hole surgery
- Capsule attachments తొలగించడం
- Severe cases లో మాత్రమే అవసరం
- 90–95% patients surgery లేకుండా recover అవుతారు
Diabetes & ఫ్రోజెన్ షోల్డర్ ముఖ్యమైన సూచనలు
- Sugar levels strict control లో ఉండాలి
- HbA1c check చేయించుకోవాలి
- Lifestyle modification అవసరం
- Treatment తో పాటు diet & exercise ముఖ్యం
Expert Treatment for Frozen Shoulder at Healio RegenX
ఫ్రోజన్ షోల్డర్ వంటి క్లిష్టమైన shoulder problems కు సరైన diagnosis మరియు advanced treatment చాలా అవసరం.
Healio RegenX లో:
- Dr Kartheek Telagareddy – MBBS, MS Ortho (Orthopedic & Shoulder Specialist)
- Dr Bhargavi Rayapureddy – MBBS, MD, FIPM (Pain Management Specialist)
ఇద్దరు నిపుణుల సమన్వయంతో Frozen Shoulder Treatment, Pain Control, మరియు Advanced Procedures ఒకే చోట అందుబాటులో ఉన్నాయి.
Frequently Asked Questions
Q : Frozen Shoulder పూర్తిగా నయం అవుతుందా?
Ans : అవును. సరైన diagnosis, stage-wise treatment తీసుకుంటే పూర్తిగా నయం అవుతుంది.
Q : Physiotherapy ఎప్పుడు ప్రారంభించాలి?
Ans : Severe pain తగ్గిన తర్వాత ప్రారంభిస్తే best results వస్తాయి.
Q : Frozen Shoulder surgery తప్పనిసరా?
Ans: కాదు. కేవలం 5% cases లో మాత్రమే surgery అవసరం.
Q : Diabetes ఉన్నవారు ఎక్కువగా బాధపడతారా?
Ans : అవును. Especially uncontrolled diabetes ఉన్నవారిలో risk ఎక్కువ.
Conclusion
Frozen Shoulder (Adhesive Capsulitis) అనేది భయపడాల్సిన వ్యాధి కాదు. సరైన అవగాహన, సమయానికి treatment తీసుకుంటే పూర్తిగా recover అవుతుంది. ముఖ్యంగా middle age people మరియు diabetes patients ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు.
Shoulder pain ఎక్కువ రోజులు ఉంటే self-treatment చేయకుండా Orthopedic Specialist ను సంప్రదించడం ఉత్తమం.
Also read : Heart Attack Symptoms: గుండెపోటు ముందస్తు లక్షణాలు ఏమిటి? ఎలా గుర్తించాలి?














