ధర్మాన ప్రసాదరావు బయోగ్రఫీ Dharmana Prasad Rao biography

ధర్మాన ప్రసాదరావు బయోగ్రఫీ Dharmana Prasad Rao biography

ధర్మాన ప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకులు.  ప్రసాదరావు గారు శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యులు మరియు మాజీ రాష్ట్ర మంత్రి.  ధర్మాన ప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ విభజన జరగక పూర్వం గల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రోడ్లు మరియు భవనాల శాఖ  రెవెన్యూ మంత్రిగా కూడా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో తాజాగా రెవెన్యూ మరియు స్టాంప్ లు రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా నియమితులయ్యారు.

పేరుధర్మాన ప్రసాదరావు
జననం1957 మే 21
పుట్టిన ప్రదేశం  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన మబగాం గ్రామంలో
రాజకీయ పార్టీ  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామిగజలక్ష్మీ
సంతానంరామమనోహర్ నాయుడు
వృత్తిరాజకీయవేత్త
నియోజకవర్గంశ్రీకాకుళం        
తండ్రిరామలింగంనాయుడు
తల్లిసావిత్రమ్మ

అతను 1981లో మబగాం గ్రామ సర్పంచ్‌గా, 1982లో బ్లాక్ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, 1987లో పోలాకి మండల తొలి అద్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసాడు. 1994లో ఎ.ఐ.సి.సి సభ్యునిగా, 2001లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా తన సేవలనందించాడు.

రాజకీయ జీవితం :

అతను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలానికి చెందిన మబగాం గ్రామంలో సావిత్రమ్మ, రామలింగంనాయుడు దంపతులకు 1957 మే 21 న జన్మించాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా 1989, 1999, 2004, 2009 అసెంబ్లీ ఎన్నికలలో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. అతను నేదురుమల్లి జనార్ధనరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గాలలో చేనేత,జౌళిశాఖ, క్రీడలు, చిన్నతరహా నీటిపారుదలం మైనరు ఫోర్టుల శాఖలకు మంత్రిగా తన సేవలనందించాడు. అతను వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసాడు.

ధర్మాన ప్రసాదరావు గారు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు  వాంపిక్ భూముల కేటాయింపులో కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించబడ్డారు పై సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నాంపల్లి ప్రత్యేక కోర్టులో చార్జి షీట్ దాఖలు చేసింది ఈ చార్జిషీట్లో మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి పేరు కూడా సిబిఐ పేర్కొంది దీంతో ధర్మాన మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు తన రాజీనామా లేఖను అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి సమర్పించారు.

Vishwarai Kalavati Biography

దీంతో పాటు సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేసినట్లు ధర్మాన గారు తెలిపారు 2013 వ సంవత్సరంలో ప్రసాదరావు ధర్మాన ప్రసాదరావు గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు  తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తన సేవలను అందిస్తున్నారు  వైఎస్సార్ సీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా మరియు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ గా శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్తగా తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జిగా అధికార ప్రతినిధిగా వివిధ హోదాల్లో పనిచేసే 2019 వ సంవత్సరంలో వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యేగా గెలిచి 2022 ఏప్రిల్ 11న వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు

Source

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

2 thoughts on “ధర్మాన ప్రసాదరావు బయోగ్రఫీ Dharmana Prasad Rao biography

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *