విశ్వాసరాయి కళావతి జీవిత చరిత్ర Vishwarai Kalavati Biography

విశ్వాసరాయి కళావతి జీవిత చరిత్ర Vishwarai Kalavati Biography
విశ్వాసరాయి కళావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకొండ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచింది
పేరు | విశ్వాసరాయి కళావతి |
జననం | 1967 |
పుట్టిన ప్రదేశం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , శ్రీకాకుళం జిల్లా , వీరఘట్టం మండలం , వండవ గ్రామం |
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
జీవిత భాగస్వామి | మండంగి హరిప్రసాద్ |
సంతానం | మండంగి సాయివైష్ణవి |
వృత్తి | రాజకీయవేత్త |
నియోజకవర్గం | పాలకొండ నియోజకవర్గం |
తండ్రి | విశ్వాసరాయి నరసింహరావుదొర |
విద్య | ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎంఏ సోషియాలజీ పూర్తి చేసారు. |
విశ్వాసరాయి కళావతి రాజకీయ జీవితం :
విశ్వాసరాయి కళావతి 2009 సంవత్సరం లో మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లో చేరి, ఆ పార్టీ తరపున పాలకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు . తరువాత ఆమె వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరి 2014 సంవత్సరం లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకష్ణపై 1652 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు . ఆమె 2019 సంవత్సరం లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మక జయకష్ణపై 17,980 ఓట్ల మెజార్టీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.
2 thoughts on “విశ్వాసరాయి కళావతి జీవిత చరిత్ర Vishwarai Kalavati Biography”