చంద్ర బాబు అరెస్ట్ పై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ MLA సీతక్క వ్యాఖ్యలు మీరు ఏకీభవిస్తున్నారా?

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి చంద్ర బాబు నాయుడు గారిని స్కిల్ స్కాం కేసు లో అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం CBN రాజముండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ గ ఉన్నారు. ఇప్పటికే చంద్ర బాబు అరెస్ట్ ని అక్రమ అరెస్ట్ గా భావించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమం లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ MLA సీతక్క కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్ర బాబు ని అరెస్ట్ చేయడం తప్పని , 40 సంవత్సరాల నుండి రాజకీయాలు చేస్తున్నారని , బాబు గారు ఏ స్కాం చేయలేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు మరియు లక్షల కోట్లలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఘనత తెలుగు దేశం పార్టీ దే అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ MLA సీతక్క పేర్కొన్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ నుండి రాజముండ్రి వరకు చంద్ర బాబు గారికి మద్దతు గ కార్ల ర్యాలీ నిర్వహిస్తున్నట్లు గ పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏ రోజు తో బాబు గారి రేమండ్ నేటితో ముగియనుండగా , రాజముండ్రి జైలు నుండి ఆన్లైన్ ద్వారా
ఏ సి బి జడ్జి ముందు చంద్ర బాబు గారిని హాజరు పర్చనున్నారు. బాబు గారి రిమాండ్ పొడిగింపు పై ఏ సి బి జడ్జి నిర్ణయం ఈ రోజు సాయంత్రం తీసుకోనున్నారు.
Chandra Babu’s arrest Telangana Congress Party MLA Sitakka Comments Do you agree?
దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియ చేయండి.
మరిన్ని వార్తలు : BRS పార్టీ మల్కాజ్‌గిరి టికెట్ ఎవరికీ ? మీ అభిప్రాయాన్ని వోట్ ద్వారా తెలియ చేయగలరు