Byreddy Siddharth Reddy Biography బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బయోగ్రఫీ

Byreddy Siddharth Reddy : బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో గుర్తింపు పొందిన నాయకుడు. గతంలో ఆయన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
Byreddy Siddharth Reddy Age, Date of Birth,Family
పేరు | హనుమాండ్ల యశస్విని రెడ్డి |
జన్మతేది | 02 మార్చి 1993 |
వయసు | 32 |
జన్మస్థలం | ముచ్చుమర్రి , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం |
తల్లిదండ్రులు | ఉషారాణి , డా. బైరెడ్డి మల్లికార్జునరెడ్డి |
జీవిత భాగస్వామి | రాజారామ్ మోహన్ రెడ్డి |
సంతానం | మాన్వి రెడ్డి |
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
విద్య | సిబిఐటి లో బి.టెక్ |
వృత్తి | రాజకీయ నాయకురాలు. |
Click here | |
Click Here |
Byreddy Siddharth Reddy Education
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి 1993 మార్చి 2న ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా, పగిడ్యాల మండలం, ముచ్చుమర్రి గ్రామంలో డాక్టర్ బైరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఉషా దంపతులకు జన్మించారు. చిన్నతనం నుంచే చురుకైన వ్యక్తిత్వంతో ఉన్న ఆయన, కడపలోని విద్యా మందిర్‌లో పదవ తరగతి పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్‌లోని సీబీఐటీలో బీటెక్‌లో చేరినా, మధ్యలోనే ఇంజనీరింగ్ చదువును విరమించారు.
Byreddy Siddharth Reddy political Career
రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబం నుండి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తాత బైరెడ్డి శేషశయనారెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పెదనాన్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా సేవలందించారు. రాజకీయ జీవనంలో మొదటి అడుగులు తన పెదనాన్నతో కలిసి వేసిన ఆయన, 2019 ఎన్నికల ముందు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తరువాత నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టి, అదే సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి తోగురు ఆర్థర్ విజయానికి కీలకంగా సహకరించారు.
2021లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తన స్వగ్రామమైన పాత ముచ్చుమర్రి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు 831 ఓట్ల మెజార్టీతో, కొత్త ముచ్చుమర్రి సర్పంచ్ అభ్యర్థి రాధమ్మ 650 ఓట్ల ఆధిక్యంతో గెలవడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారు.
అదే సంవత్సరం జూలై 17న ప్రభుత్వం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఛైర్మన్‌గా నియమించింది. క్రీడాశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, నీటివనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో, ఆయన 2021 ఆగస్టు 6న ఛైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు.
2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత, శాప్‌లో మిగిలిన సభ్యులతో కలిసి ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Also Read : Ambati Rambabu Biography అంబటి రాంబాబు
One thought on “Byreddy Siddharth Reddy Biography బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బయోగ్రఫీ”