Atchannaidu Biography అచ్చెన్నాయుడు బయోగ్రఫీ

Atchannaidu : కింజరాపు అచ్చంనాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 2014 నుండి టెక్కలి శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేతగా పార్టీలో విశేష సేవలు అందిస్తున్నారు.
Atchannaidu Age, Date of Birth, Family
పేరు | కింజరాపు అచ్చంనాయుడు |
జన్మతేది | 1971 మార్చి 26 |
వయసు | 54 |
జన్మస్థలం | టెక్కలి మండలం నిమ్మాడ గ్రామం |
తండ్రి | దాలినాయుడు |
జీవిత భాగస్వామి | విజయమాధవి |
సంతానం | కృష్ణ మోహన్ నాయుడు , తనూజ |
రాజకీయ పార్టీ | తెలుగు దేశం |
విద్య | కృష్ణా కళాశాల, విశాఖపట్నంలో బి.యస్సీ చదివారు |
వృత్తి | రాజకీయము , వ్యవసాయము |
నియోజకవర్గం | టెక్కలి |
Click Here | |
Click Here | |
Click Here |
జన్మ స్థలం – విద్యాభ్యాసం:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలానికి చెందిన నిమ్మాడ గ్రామంలో, మార్చి 26, 1971న అచ్చెన్నాయుడు గారు జన్మించారు. ఆయన తండ్రి దాలినాయుడు గారు. విద్యారంగంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత కృష్ణా డిగ్రీ కాలేజీలో బి.యస్సీ చదివారు. Acham naidu caste కాపు.
Acham Naidu Son
Acham Naidu Son కృష్ణ మోహన్ నాయుడు కింజరాపు

ప్రారంభ రాజకీయ జీవితం:
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యర్రంనాయుడు గారికి తమ్ముడైన అచ్చెన్నాయుడు గారు, 1996లో హరిశ్చంద్రపురం నియోజకవర్గ ఉపఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుండి ప్రజాసేవే ఆయన ధ్యేయంగా మారింది. ఆయన 1999, 2004లో వరుసగా హరిశ్చంద్రపురం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
నియోజకవర్గ మార్పులు – రాజకీయ పోరాటం:
పునర్విభజన తర్వాత హరిశ్చంద్రపురం నియోజకవర్గం రద్దు కావడంతో, ఆయన టెక్కలి నియోజకవర్గాన్ని తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రంగా చేసుకున్నారు. అయితే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె. రేవతీపతికి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలో రేవతీపతి గారి భార్య భారతి పై పోటీ చేసినప్పటికీ మరోసారి పరాజయం ఎదుర్కొన్నారు.
విజయాల శకం – మంత్రిత్వ బాధ్యతలు:
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున టెక్కలి నియోజకవర్గం నుంచి గెలిచి మూడోసారి శాసనసభలో అడుగుపెట్టారు. అప్పటి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కార్మికశాఖ మంత్రిగా, క్రీడలు, యువజనశాఖ, బీసీ సంక్షేమం, జౌళి శాఖ వంటి విభాగాల బాధ్యతలు నిర్వర్తించారు. 2019లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి పేరార తిలక్ పై గెలుపొందారు.
ప్రస్తుతం:
2024 అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి టెక్కలి నియోజకవర్గం నుంచి గెలిచి, తాజాగా 2024 జూన్ 12న ఏర్పాటు అయిన చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖతోపాటు పశుసంవర్థక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ అభివృద్ధిలో తన పాత్రను నిబద్ధతతో నిర్వహిస్తున్నారు.
Also Read : PV Midhun Reddy Biography
One thought on “Atchannaidu Biography అచ్చెన్నాయుడు బయోగ్రఫీ”