రైతులకు భారీ ఆర్థిక సహాయం..? ఎమ్మెల్యే చింతమనేని సంచలన ప్రకటన!

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కీలక ప్రకటన! రైతులకు భారీ ఆర్థిక సహాయం కౌలు రైతులకు కూడా తీపి కబురు. పూర్తి సమాచారం కోసం చదవండి.

రైతుల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, జూన్ నాటికి ‘అన్నదాత సుఖీభవ’ పథకం అమలులోకి వస్తుందని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. ఈ పథకం కింద ప్రతి రైతుకూ రూ.20 వేలు పెట్టుబడి సాయం అందించనున్నారు.

దెందులూరు మండలంలోని పోతునూరు మరియు కొవ్వలి గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి ధాత్రి రెడ్డి గారితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సబ్సిడీ పవర్ ట్రిల్లర్లను రైతులకు పంపిణీ చేశారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

annadata sukhibhava chinthamaneni prabhakar

ఈ సందర్భంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వ కాలంలో రైతులు ధాన్యం విక్రయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తుచేస్తూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు సుఖంగా ఉన్నారని తెలిపారు. ధాన్యం కొనుగోలు అనంతరం 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే, కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ ప్రయోజనం అందేలా వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చిన్నా సన్నకారు కౌలు రైతుల వివరాలు పూర్తిగా నమోదు చేయాలన్న ఆయన, ఈ పథకం ప్రయోజనం ప్రతి ఒక్క రైతుకూ అందేలా కలిసికట్టుగా పనిచేయాలన్నారు.

మరికొన్ని గ్రామాల్లో ఈ సీజన్‌లో ఎకరాకు 60 బస్తాలు వరకు ధాన్యం పండించామని ఆయన తెలిపారు. గత ప్రభుత్వాల్లో ఎకరాకు నిర్ణీత పరిమితి వరకే ధాన్యం కొనుగోలు చేశారని, అయితే ఇప్పుడు రైతులు ఎంత పండించినా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.

Also Read : వైఎస్సార్‌ వారసత్వం పై యుద్ధం మొదలైందా? షర్మిల తాజా బాంబు!

Leave a Comment

alekhya chitti hot photos goes viral Preity Mukhundhan : 2 సినిమాలతోనే స్టార్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ బ్యూటీ Pooja Hegde: సౌత్‌లో విజయాలు, బాలీవుడ్‌లో ఎదురైన సవాళ్లు పాలక్ తివారీ మారిషస్ హాలీడేలో స్టన్నింగ్ లుక్స్‌ ఫోటోలు వైరల్! Varsha Bollamma Telugu Movie List Actress Divi Vadthya ఫిట్‌నెస్ ఫొటోలు ఫ్యాషన్ టచ్‌తో సోషల్ మీడియాలో వైరల్ శ్రీముఖి బీచ్ ఫోటోస్: వైరల్ అవుతున్న తాజా గ్లామర్ స్టిల్స్ చూడండి చమ్కీల చీరలో హెబ్బా పటేల్ అదిరిపోయే లుక్! naga manikanta wife daughter rare photos శ్రద్ధా దాస్ గ్లామర్ పిక్స్ కలకలం