ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం – పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పు అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల నేపథ్యంలో, కొత్త జిల్లాల ఏర్పాటుపై విన్నపాలు అధికంగా వచ్చాయి. వీటిని పరిశీలించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఏడుగురు మంత్రులు సభ్యులుగా ఉండగా, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
ఈ కమిటీ ప్రధానంగా జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పులు పరిపాలనలో ఎంతవరకు ఉపయోగపడతాయో, ప్రజలకు ఎలాంటి లాభాలు ఉంటాయో అన్న అంశాలపై లోతుగా అధ్యయనం చేయనుంది. ప్రజల అభ్యర్థనలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు, ప్రాంతీయ సమస్యలు అన్నీ కూడా పరిశీలించబోతున్నారు. అలాగే, మార్పులు చేర్పులు తీసుకునే సందర్భంలో ఆ ప్రాంత చరిత్ర, సంస్కృతి, భౌగోళిక పరిస్థితులు, జనాభా వివరాలు, సామాజిక-ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు.
2022లో జరిగిన జిల్లాల విభజనపై గతంలో కొన్నాళ్లుగా అభ్యంతరాలు వస్తూనే ఉన్నాయి. జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు పెంచినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో సరిహద్దుల వల్ల ఏర్పడిన అసౌకర్యాలు, పలు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభావం చూపిన ఘటనలు వెలుగుచూశాయి. ఫలితంగా దాదాపు 80,000 ఫిర్యాదులు అప్పట్లో వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజలు మరోసారి తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వాటిని ప్రభుత్వ అధికారం బలంగా పరిగణలోకి తీసుకుంటోంది.
కమిటీ నివేదిక ఆధారంగా జిల్లాల పేర్లు, సరిహద్దులు మారుస్తారా, లేదా అన్నది తేలనుంది. సమగ్రంగా అధ్యయనం చేసి పరిపాలన సౌలభ్యం, ప్రజల మేలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వనుంది. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకునే దిశగా కమిటీ ప్రయత్నిస్తుందని తెలుస్తోంది.
Also Read : Vijay Deverakonda ‘కింగ్‌డమ్’ టికెట్ ధరలకు ఏపీ గ్రీన్ సిగ్నల్ – సినిమా రిలీజ్, ప్రచారం, విశేషాలు!
One thought on “ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, సరిహద్దులు మార్పుపై ప్రభుత్వం కీలక నిర్ణయం – పూర్తి వివరాలు!”