MLA Seethakka Biography ఎంఎల్ఏ సీతక్క బయోగ్రఫీ

ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క అంటే ఎవరికైనా తెలుసు అసలు పేరు దాసరి అనసూయ. సీతక్క రెండుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడిన నాయకురాలు మరియు అఖిలభారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన సీతక్క.

MLA Seethakka Age, Date of Birth

పేరుధనసరి అనసూయ (సీతక్క)
జననం1971 జూలై 9 (వయసు 52)
 రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ
సంతానంసూర్య
జీవిత భాగస్వామిదివంగత శ్రీరాము
పుట్టిన ప్రదేశంజగ్గన్నపేట్ గ్రామం, ములుగు మండలం, ములుగు జిల్లా
TwitterClick Here
InstagramClick Here
FacebookClick Here

MLA Seethakka Political Career

2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమిపాలైంది సీతక్క. తర్వాత 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫునుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మూడోసారి టిడిపి అభ్యర్థినిగా బరిలోకి దిగి , అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీర చందూలాల్ చేతిలో ఓడిపోయింది. అప్పుడు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ దిగి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అడ్మిరా చందులాల్ పై తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి అడ్మిరా చందులాల్ పై 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచారు సీతక్క. సీతక్క 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలుగా నియమితురాలైంది.

Also Read : అనుముల రేవంత్ రెడ్డి జీవిత చరిత్ర

Leave a Comment