Swarna Panchayat Website: How to Pay AP House Tax Online on Mobile (2025 Guide)

Swarna Panchayat Website: How to Pay AP House Tax Online on Mobile (2025 Guide)

Swarna Panchayat వెబ్‌సైట్ ద్వారా హౌస్ టాక్స్ ఎలా చెల్లించాలి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రజలకు సులభంగా పన్నులు చెల్లించుకునే విధంగా Swarna Panchayat వెబ్‌సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇంతకు ముందు పంచాయతీ కార్యదర్శి ఇంటింటికీ వచ్చి పన్ను వసూలు చేసి రసీదు ఇస్తుండేవారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ (మినహాయింపులు ఉన్నవారిని తప్ప) తాము స్వయంగా మొబైల్ ద్వారా ఇంటి పన్ను (AP House Tax Payment) చెల్లించుకునే సౌకర్యాన్ని పొందుతున్నారు.

ఈ వ్యాసంలో మనం Swarna Panchayat House Tax Payment Process in Mobile గురించి స్టెప్-బై-స్టెప్‌గా తెలుసుకుందాం.

Swarna Panchayat House Tax Payment Step by Step Process

Step 1: అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.

 మీ మొబైల్ బ్రౌజర్‌లో Swarna Panchayat అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.

Step 2: వివరాలు నమోదు చేయండి

  • Financial Year: 2024-25 ఎంచుకోండి
  • District: మీ జిల్లా ఎంచుకోండి
  • Mandal: మీ మండలం ఎంచుకోండి
  • Panchayat: మీ పంచాయతీ ఎంచుకోండి
  • Village: మీ గ్రామం ఎంచుకోండి
  • Search Option: Assessment Number / Owner Name / Door No / Old Assessment Number లో ఒకదాన్ని ఎంచుకోండి.

ఎక్కువమంది సులువుగా Owner Name ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు.

Step 3: బకాయి మొత్తం తెలుసుకోండి

మీ ఇంటి పేరుకు సంబంధించిన పన్ను మొత్తం, ప్రస్తుత సంవత్సరం బకాయి, అలాగే పాత బకాయిలు ఉంటే అవి కూడా చూపిస్తాయి.

Step 4: పేమెంట్ ప్రాసెస్

  • “View Due & Pay” పై క్లిక్ చేయండి
  • Mobile Number నమోదు చేసి Proceed for Payment ఎంచుకోండి
  • పేమెంట్ ఆప్షన్ (UPI, PhonePe, Google Pay, QR Code, Debit/Credit Card) ద్వారా చెల్లించండి
  • పేమెంట్ పూర్తయిన తర్వాత Receipt PDF డౌన్‌లోడ్ చేసుకోండి

Swarna Panchayat House Tax Payment లో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్లు

  • UPI ID (PhonePe / GPay / Paytm వంటివి)
  • QR Code Scan
  • Debit / Credit Card
  • Net Banking

FAQs – Swarna Panchayat హౌస్ టాక్స్ పేమెంట్

Q1. Swarna Panchayat వెబ్‌సైట్‌లో పేమెంట్ చేసిన తర్వాత రసీదు వస్తుందా?

Ans : అవును, మీరు పేమెంట్ పూర్తి చేసిన వెంటనే PDF Receipt డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Q2. నా పేరు లేదా ఇంటి వివరాలు తప్పుగా వస్తే ఏమి చేయాలి?

Ans : అలాంటి సందర్భంలో వెంటనే మీ పంచాయతీ కార్యదర్శిను సంప్రదించాలి.

Q3. మొబైల్‌లోనే పేమెంట్ చేయవచ్చా లేక ల్యాప్‌టాప్ అవసరమా?

Ans : మీరు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ రెండింట్లోనూ సులభంగా పేమెంట్ చేయవచ్చు.

Q4. పాత బకాయిలు కూడా ఒకేసారి చెల్లించవచ్చా?

Ans : అవును, ప్రస్తుత బకాయి + పాత బకాయిలు రెండూ కలిపి పేమెంట్ చేయడానికి అవకాశం ఉంది.

ముగింపు

ప్రస్తుత కాలంలో డిజిటల్ సేవలు మన జీవితాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. Swarna Panchayat వెబ్‌సైట్ ద్వారా హౌస్ టాక్స్ చెల్లింపు ప్రాసెస్ పూర్తి పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉంది. ఇకపై కార్యదర్శి కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు – మీ మొబైల్‌లోనే 5 నిమిషాల్లో పన్ను చెల్లించి రసీదు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Also Read : MGNREGA Job Card Payment Status 2025: ఉపాధి హామీ పథకం పేమెంట్ స్టేటస్