Household Mapping in AP 2025: Online Registration, Status Check & Benefits Explained

House Hold Mapping in AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ అందించే పథకాలు, సర్వీసులు, రిజిస్ట్రేషన్లు, సబ్సిడీలు, స్కాలర్‌షిప్‌లు మొదలైన ప్రతి సేవకూ ఒకే ప్రాతిపదికగా పనిచేసే కీలకమైన వ్యవస్థ హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ (Household Mapping).
ఇది లేకుండా ప్రభుత్వం అందించే సేవలు పొందడం కష్టమవుతుంది. అందుకే ప్రతి కుటుంబానికి హౌస్ మ్యాపింగ్ తప్పనిసరి.
House Hold Mapping అంటే ఏమిటి?
ఒకే కుటుంబానికి చెందిన వారందరినీ ఆధార్ నంబర్ ఆధారంగా ఒకే హౌస్ ఐడీకి లింక్ చేసి, కుటుంబంలోని సభ్యుల వివరాలను ఒకే చోట నమోదు చేయడం హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అని అంటారు.
ఇది పూర్తయితే –
- పథకాల అర్హత తేలికగా తెలుసుకోవచ్చు.
- పుట్టిన కొత్త పిల్లలు, కొత్త కోడలు వంటి వారిని వెంటనే జోడించవచ్చు.
- ఎవరైనా వితంతువు, ఒంటరి వ్యక్తి, ట్రాన్స్‌జెండర్ అయితే కూడా ప్రత్యేకంగా నమోదు అవుతారు.
- ప్రభుత్వ సర్వేల్లో తప్పనిసరిగా మీ పేరు చేరుతుంది.
ఎవరు House Hold Mapping చేయించుకోవాలి?
- పుట్టిన శిశువులు.
- కొత్తగా పెళ్లి అయ్యి ఇంటికి వచ్చిన కోడలు.
- ఇప్పటి వరకు మ్యాపింగ్‌లో లేని కుటుంబ సభ్యులు.
- ఒంటరిగా నివసించే వారు (అవివాహితుడు/వితంతువు/ట్రాన్స్‌జెండర్).
House Hold Mapping ఎక్కడ చేయించుకోవాలి?
- మీ శాశ్వత చిరునామా ఉన్న చోటే చేయించుకోవడం మంచిది.
- గ్రామంలో ఉంటే → గ్రామ సచివాలయం (పంచాయతీ కార్యదర్శి / డిజిటల్ అసిస్టెంట్ ద్వారా).
- పట్టణంలో ఉంటే → వార్డ్ సచివాలయం (వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ద్వారా).
- ప్రస్తుతం కొత్త ఆప్షన్ ద్వారా ప్రతీ ఒక్కరూ సొంతంగా కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు.
House Hold Mapping Status Check
- NBM పోర్టల్లో లాగిన్ అవ్వాలి (సచివాలయ ఉద్యోగుల ద్వారా).
- “Scheme Eligibility Check” ఎంచుకోవాలి.
- ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి → సంవత్సరం (2024-25) సెలెక్ట్ చేయాలి.
- సబ్మిట్ చేసిన వెంటనే → మీ కుటుంబంలో ఎవరి పేర్లు ఉన్నాయో పూర్తి లిస్ట్ వస్తుంది.
కొత్త సభ్యులను ఎలా జోడించాలి? (Self Service Option)
- Household Mapping Portal ఓపెన్ చేయాలి.
- “Aadhar Authentication” ద్వారా OTP వెరిఫై చేసుకోవాలి.
- సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఆధార్ వివరాలు (పేరు, DOB, లింగం) చూపిస్తుంది.
- కింది వివరాలు ఎంటర్ చేయాలి:
- మొబైల్ నెంబర్
- డోర్ నెంబర్, వీధి పేరు
- జిల్లా, మండలం, సచివాలయం
- వివాహ స్థితి, విద్య, వృత్తి
- కులం, ఉపకులం, మతం
- కుటుంబం ఒకరే ఉంటే → ఒంటరి / వితంతువు / ట్రాన్స్‌జెండర్ వంటి ఆప్షన్ ఎంచుకుని సబ్మిట్ చేయాలి.
- ఒకరి కన్నా ఎక్కువ ఉంటే → YES సెలెక్ట్ చేసి, కుటుంబ సభ్యుల ఆధార్ ఎంటర్ చేసి వారి Household IDకి జోడించాలి.
- 24-48 గంటల్లోపే పేరు Household Mappingలో యాడ్ అవుతుంది.
House Hold Migration – అడ్రెస్ మార్చుకోవాలి అంటే?
- కొన్నిసార్లు తప్పుగా వేరే గ్రామం/క్లస్టర్‌లో Household Mapping అయి ఉంటుంది. అప్పుడు మైగ్రేషన్ ప్రాసెస్ ద్వారా సొంత ఊరికి మార్చుకోవచ్చు.
- ఇది సొంతంగా చేయలేరు.
- తప్పనిసరిగా గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా మాత్రమే చేయించుకోవాలి.
- అన్ని కుటుంబ సభ్యులు కలసి మైగ్రేట్ అవుతారు. (ఒక్కడినే మార్చే ఆప్షన్ లేదు).
- అయితే, పెళ్లి అయిన మహిళకు మాత్రం ప్రత్యేకంగా మైగ్రేషన్ చేసి అత్తవారి ఇంటికి జోడించే అవకాశం ఉంది.
- అందుకు భర్త, భార్య ఇద్దరూ కలిసి → ఆధార్, మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పిస్తే చాలు.
ఎందుకు తప్పనిసరిగా Household Mapping ఉండాలి?
- ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక
- రేషన్ కార్డు, పింఛన్లు, స్కాలర్‌షిప్‌లు
- ఇసుక బుకింగ్, RTO సేవలు
- హెల్త్ స్కీమ్స్, DBT (Direct Benefit Transfer)
- కొత్తగా వచ్చే సబ్సిడీలు & ప్రోత్సాహకాలు
- ప్రతీ ఒక్కరికి Household Mapping ఉండటం తప్పనిసరి.
ముగింపు
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 95% Household Mapping పూర్తయింది. మిగిలిన వారు వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ప్రభుత్వం ప్రకటించే పథకాల లబ్ధి కోల్పోయే ప్రమాదం ఉంది.
అందువల్ల మీ కుటుంబంలోని ప్రతి సభ్యుని హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌లో జోడించారో లేదో ఒకసారి తప్పనిసరిగా చెక్ చేసుకోండి.
Also Read : e-Panta App 2025-26: AP రైతుల కోసం Digital Crop Booking, e-KYC & Timelines