వాతావరణం స్పోర్ట్స్ జాబ్ - ఎడ్యుకేషన్ బిజినెస్ లైఫ్ స్టైల్
రాశి ఫలాలు

mangalagiri free bus service మంగళగిరిలో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

On: March 12, 2025 4:05 AM
Follow Us:
మంగళగిరిలో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

mangalagiri free bus service : మంగళగిరిలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ రెండు ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగంగా, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలను అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉచిత బస్సు సర్వీసుల్లో ఒకటి మంగళగిరి ఎయిమ్స్‌కు, మరొకటి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ప్రత్యేకంగా నడుస్తుంది. ఈ సర్వీసులు ప్రధానంగా భక్తులు, రోగులు, మరియు సాధారణ ప్రజల ప్రయాణానికి అనువుగా ఉండేలా ఏర్పాటు చేశారు.

ఈరోజు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు సేవలను ప్రారంభించాను. సుదూర ప్రాంతాల నుంచి ఎయిమ్స్ హాస్పటల్, పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ఇబ్బందులు నా దృష్టికి వచ్చాయి. నా విజ్ఞప్తి మేరకు మెగా ఇంజనీరింగ్ సంస్థ సిఎస్ఆర్ నిధుల నుంచి రూ.2.4 కోట్ల విలువైన రెండు ఒలెక్ట్రా బస్సులను ఉచితంగా అందించింది. ఈ బస్సుల్లో ఒకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్, డిజిపి ఆఫీసు మీదుగా ఎయిమ్స్ కు, మరొకటి మంగళగిరి బస్టాండు నుంచి ఎన్ఆర్ఐ జంక్షన్ మీదుగా పానకాలస్వామి గుడివరకు ఉచితంగా ప్రజలకు సేవలు అందిస్తాయి.

మంగళగిరిలో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రజలకు మంచి సేవలు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. భక్తులకు, రోగులకు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ఉచిత బస్సు సర్వీసులను ప్రారంభించాం అని తెలిపారు.

మంగళగిరిలో ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

ఈ కార్యక్రమానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

download 10

Also Read : PM Modi Mauritius Visit: మారిషస్‌లో ప్రధానికి ఘన స్వాగతం, ద్వైపాక్షిక ఒప్పందాలు

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment