YouWeCan Charity కోసం లండన్లో ఘనంగా నిర్వహించిన ఈవెంట్లో యువరాజ్ సింగ్తో కలిసి సచిన్, విరాట్, కెవిన్ పీటర్సన్ పాల్గొన్నారు. ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
యువీ లక్ష్యం కోసం క్రికెట్ స్టార్స్ కదలిక!
టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రారంభించిన YouWeCan ఫౌండేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ దిగ్గజాలు కలిసి వచ్చారు. లండన్లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్ సందర్బంగా క్రికెట్ ప్రపంచం ఒకే వేదికపై కనబడింది.

ఈ వేడుకలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి, అజిత్ అగార్కర్, కెవిన్ పీటర్సన్ తదితరులు పాల్గొనడం విశేషం. బీసీసీఐ ఈ సందర్భంగా ఫొటోలను తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.
క్యాన్సర్ బాధితుల కోసం సేవలు
యువరాజ్ సింగ్ తన క్యాన్సర్ అనుభవం తర్వాత ప్రారంభించిన YouWeCan charity, క్యాన్సర్ బాధితులకు వైద్య సహాయం, అవగాహన, మానసిక పరిరక్షణ వంటి సేవలు అందిస్తోంది. ఈవెంట్ ద్వారా తగిన నిధులు సేకరించి మరింత మందికి సహాయం చేయడమే లక్ష్యం.
ఫ్యాన్స్ స్పందన హోరెత్తించేది!
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు “నాయకులు ఒకేచోట” అంటూ హర్షాతిరేకాలతో స్పందిస్తున్నారు.
Also Read : Kubera Favourite Zodiac Signs Telugu | కుభేర దేవుడి కరుణ కలిగిన రాశులు ఎవెవరు?













1 thought on “YouWeCan Charity : యువరాజ్ ఛారిటీ ఈవెంట్లో క్రికెట్ దిగ్గజాలు సచిన్, విరాట్, శాస్త్రి సందడి”