మీ నియోజకవర్గం లో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏ పార్టీకి ఓటు వేస్తారు ?

మీ నియోజకవర్గం లో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏ పార్టీకి ఓటు వేస్తారు ?

తెలంగాణ రాష్ట్రం 2014, జూన్ 2న అధికారికంగా ఏర్పాటయింది. అప్పటి నుండి, తెలంగాణ రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో వివిధ సంస్థల ప్రతినిధులను ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నిర్వహించబడతాయి.

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో 3 షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి), 2 షెడ్యూల్డ్ తెగలు (ఎస్.టి) కోసం రిజర్వ్ చేయబడ్డాయి. ఓటర్లు తమ అభ్యర్థిని పార్లమెంటు సభ్యునిగా (ఎంపీ) చేయడానికి ఓటింగ్ పద్ధతి ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలంగాణలో ఒక్కసారి మాత్రమే లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.

తెలంగాణ శాసనసభలో మొత్లం 119 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 18 షెడ్యూల్డ్ కులాలు (ఎస్.సి), 9 షెడ్యూల్డ్ తెగలు (ఎస్.టి)లకు రిజర్వ్ చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2014, ఏప్రిల్ 30న తెలంగాణ తొలి శాసనసభను ఏర్పాటు చేయడానికి మొదటి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు 2014 మే 16న ప్రకటించబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) 63 స్థానాలను గెలుచుకుని మెజారిటీని సాధించి, తొలి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. టీఆర్‌ఎస్‌ వ్యవస్థాపకుడు కె. చంద్రశేఖర్‌రావు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. కేసీఆర్ విజ్ఞప్తి మేరకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముందుగానే అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత 2018 డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్ర రెండో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2018, డిసెంబరు 11న ఫలితాలు ప్రకటించబడ్డాయి. టిఆర్ఎస్ పార్టీ మెజారిటీని కొనసాగించి, 88 సీట్లు గెలుచుకుంది. కేసీఆర్ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు

Your current voting choice in your constituency

Also Read : ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదీ ?

మీ నియోజక వర్గం కామెంట్ రూపంలో తెలియ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *