ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల విధులకు వాలంటీర్లు దూరమైన సంగతి తెలిసిందే పింఛన్ల పంపిణీకి కూడా వారిని దూరంగా ఉంచాలని వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. పించను దారులంతా గ్రామా మరియు వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛను తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార మరియు ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మరోవైపు కొందరు వాలంటీర్లు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి శుభవార్తను వినిపించారు.
చిత్తూరు జిల్లా నాయుడుపేటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రను చేపట్టా.రు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతుందని తొలి సంతకం వాలంటీర్ల వ్యవస్థ పైన పెడుతున్నారని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇప్పుడున్న పథకాలను అమలు చేస్తామన్నారు మేనిఫెస్టోలో లేని వాటిని కూడా సాధ్యమైనంత వరకు పథకాలను ఇంటింటికి అందజేస్తామన్నారు.
ధర్మాన ప్రసాదరావు బయోగ్రఫీ Dharmana Prasad Rao biography
నారా చంద్రబాబు నాయుడు లా తాను మోసపూరితమైన హామీలు మరియు అబద్ధాలు చెప్పనని 2014వ సంవత్సరం ఎన్నికల్లో హామీలు అంటూ ఫోటోలు సంతకాలతో ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటులో కుట్రలో మోసాలు, కుతంత్రాలు ఎద్దేవా చేశారు. అని పొత్తులు జిత్తులతో పని లేకుండా ఇంటింటికి మంచి చేశామని జగన్ అన్నారు చంద్రబాబు కిచిడి మేనిఫెస్టోతో తాను పోటీపడదలుచుకోలేదన్నారు.
వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య రాజకీయ రగడ జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం కావాలనే నగదును ఇంటింటికి పంపిణీ చేయకుండా ఎత్తుగడలకు పాల్పడుతుందని తెలుగుదేశం పార్టీ జనసేన మరియు బిజెపి విమర్శిస్తున్నాయి చంద్రబాబు వల్లే పింఛన్లు ఇంటింటికి అందడం లేదంటూ వైసీపీ పార్టీ ప్రచారం చేస్తుంది.













2 thoughts on “వాలంటీర్లకు వైఎస్ జగన్ బంపర్ ఆఫర్ Y S Jagan bumper offer for volunteers”