ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయు ధం నోటాకు కనుక ఎక్కువ ఓట్లు వస్తే..?

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయు ధం నోటాకు కనుక ఎక్కువ ఓట్లు వస్తే..?

ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక వజ్రాయుధం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తమ నియోజకవర్గ పరిధి పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే ఏం చేయాలి? ఎవరికో ఒకరికి ఓటు వేయకుండా తమ నిరసనను వ్యక్తం చేయడం ఎలా? దీనిపై 2003వ సంవత్సరంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అనేక వాదోపవాదములు జరిగిన తర్వాత నోటాను ఈవీఎంలలో చేర్చాలని సుప్రీం సూచించింది. 2014 ఎన్నికల నుంచి ఎన్నికల సంఘం ఈవీఎం మెషిన్లలో నోటాను చేర్చింది. బరిలో ఉన్న వారెవరు నచ్చకపోతే నోటా మీద నొక్కవచ్చు. అయితే జిల్లాల్లో జరిగిన రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఎన్నికల్లో నోటాకు ఒక శాతానికి మించి ఓట్లు పడకపోవడం గమనార్హం.

ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వేస్తే 2014 నుంచి అమల్లోకి వచ్చిన నోటాకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో కేవలం 0.2 నుంచి 0.4% మాత్రమే. 2018 ఎన్నికల్లో 0.5 నుంచి 0.8% వరకు ఓట్లు వచ్చాయి. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే దాని తర్వాత స్థానంలో నిలిచిన వారు గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు నోటాను అమలు చేస్తున్నాయి. మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ 2008 నుంచి నోటాను అమలు చేస్తుంది. పాకిస్తాన్ 2013 నుంచి నోటాను అమలు చేస్తుంది. కొలంబియా స్పెయిన్, బ్రెజిల్, గ్రీస్, పిన్ ల్యాండ్, స్వీడన్, చిలీ వంటి దేశాలు ఓట్ ఆఫ్ రిజెక్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. బెల్జియం, ఫ్రాన్స్, యూఎస్ఏ లో ఈవీఎంల మీద నోటాను అమలు చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పసుపు కుంకుమ తులం బంగారం గ్యారంటీ

One thought on “ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక వజ్రాయు ధం నోటాకు కనుక ఎక్కువ ఓట్లు వస్తే..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *