Vidadala Rajini Age, Date of Birth, Education, Family, Cast, Political Career
Vidadala Rajini ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. చిలకలూరిపేట శాసనసభ నియోజకవర్గం నుండి విజయం సాధించి, ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
రజిని తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం, కొండాపూర్ గ్రామంలో జన్మించారు.
Vidadala Rajini Age, Date of Birth, Education, Family, Cast
2011లో, ఆమె హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో బిఎస్సీ పూర్తి చేశారు. అనంతరం, ఐటీ రంగంలోకి ప్రవేశించి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా సేవలందించారు. vidadala rajini cast కాపు కులానికి చెందినవారిగా పేర్కొనబడుతున్నారు.
| పేరు | విడదల రజిని |
| జననం | 24 జూన్ 1990 |
| పుట్టిన ప్రదేశం | కొండాపూర్, తుర్కపల్లి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ |
| రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ |
| జీవిత భాగస్వామి | కుమారస్వామి |
| సంతానం | ఇద్దరు పిల్లలు |
| వృత్తి | రాజకీయ నాయకురాలు |
| నియోజకవర్గం | చిలకలూరిపేట |
| విద్య | హైదరాబాదు మల్కాజ్‌గిరి లోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి. పూర్తి చేసింది |
Vidadala Rajini Husband

Vidadala Rajini Family

విడదల రజిని ప్రజా సేవ
విడదల రజిని తన ప్రాంత ప్రజలకు సహాయపడాలనే ఉద్దేశంతో అమెరికా నుండి స్వదేశానికి వచ్చారు. భర్త కుమారస్వామి ప్రోత్సాహంతో చిలకలూరిపేటలో “వి.ఆర్ ఫౌండేషన్”ను ప్రారంభించి, అనేక సామాజిక కార్యక్రమాలకు నాంది పలికారు.
విడదల రజిని 2014లో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఆమె తెలుగుదేశం పార్టీలో చేరి, తన సేవా కార్యక్రమాలను విఆర్ ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో విస్తృతంగా కొనసాగించారు.
Vidadala Rajini Political Career విడదల రజిని రాజకీయ జీవితం
2019 ఎన్నికల సమయంలో, చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోరారు. కానీ, అదే స్థానం నుంచి ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్న కారణంగా, 2018లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావును 8,301 ఓట్ల మెజారిటీతో ఓడించి విజయం సాధించారు.
Also Read : Telugu Political News
2022 ఏప్రిల్ 11న, మంత్రివర్గ విస్తరణలో భాగంగా, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో 51,150 ఓట్ల తేడాతో ఓటమి చెందారు.

One thought on “Vidadala Rajini Age, Date of Birth, Education, Family, Cast, Political Career”