కూరగాయల వ్యాపారికి ₹29 లక్షల GST నోటీసు డిజిటల్ లావాదేవీలపై కలకలం

కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లాకు చెందిన శంకర్‌గౌడ్ అనే కూరగాయల విక్రేతకు రూ.29 లక్షల GST నోటీసు రావడం సంచలనంగా మారింది. నానా ఇబ్బందులతో తన జీవనోపాధి నెయ్యగలిగే స్థాయిలో ఉన్న ఆయన నాలుగు సంవత్సరాల్లో UPI ద్వారా రూ.1.63 కోట్ల మేర లావాదేవీలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై ఆధారంగా ఆయనకు ఈ భారీ పన్ను నోటీసు జారీచేశారు.
తన రోజువారీ వ్యాపారాన్ని డిజిటల్ చెల్లింపులు సులభతరం చేయడంతో QR కోడ్ సిస్టమ్ పెట్టి నగదు తీసుకోకుండా కేవలం GPay, PhonePe వంటివి ఉపయోగించి లావాదేవీలు జరిపిన శంకర్‌గౌడ్‌కు ఇప్పుడు ఇది తీవ్రమైన సమస్యగా మారింది. సాధారణంగా రోజుకు కొన్ని వందల రూపాయలు మాత్రమే అమ్మకాలు జరిపే ఈ విక్రేతకు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని అధికారుల ఆరోపణ తాలూకు ఆధారంగా ఆయనకు బకాయి పన్ను పడింది.
అయితే ఈ వ్యవహారంపై శంకర్‌గౌడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను కేవలం కూరగాయలు అమ్ముతూ బతికే ఒక సాధారణ వాడిని. 4 కోట్లు ఎక్కడ వచ్చాయి? నా దగ్గర లేనిదాన్ని ఎలా చెల్లించమంటారు?” అంటూ ప్రశ్నించారు. అతడి వాదనలో సత్యం ఎంత ఉన్నా, ఆధునిక వ్యవస్థలో ట్రాన్సాక్షన్ ఆధారంగా పన్నుల లెక్కలు వేయడమే జరుగుతోంది.
ఈ సంఘటనతో ఇప్పుడు చిన్న వ్యాపారులు భయాందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికే బెంగళూరు, మైసూరు వంటి ప్రాంతాల్లో చిన్న వ్యాపారులు తమ QR కోడ్లను తీసేసి మళ్లీ ‘క్యాష్ ఓన్లీ’ పద్ధతికి తిరిగివస్తున్నారు. డిజిటల్ ఇండియా పేరుతో ఉన్న ప్రోత్సాహకాలు ఇప్పుడు మోసపూరితంగా మారాయని పలువురు వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
GST శాఖ నుండి వచ్చిన వివరణ ప్రకారం, చెల్లింపులు UPI గానీ, క్యాష్ గానీ ఏ రూపంలో జరిగినా, మొత్తం ఆదాయాన్ని బట్టి పన్ను విధించాల్సిందేనని వారు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ ప్రశ్న ఇది—చిన్న వ్యాపారులకు ఈ విషయాలపై ఎంత అవగాహన ఉంది? వారు నిజంగా ఈ పన్ను చట్టాల పరిధిలోకి వస్తారా? లేకపోతే డిజిటల్ వ్యవహారాలను ప్రోత్సహించడం పేరుతో మరింత భారం మోపడం జరుగుతోందా?
ఈ సంఘటన దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ లావాదేవీలపై, చిన్న వ్యాపారులపై పన్నుల వ్యవస్థ ఎలా ప్రభావం చూపుతోందనే విషయంపై పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వం ఒకవైపు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తే, మరోవైపు వాటిని ఆధారంగా చేసుకొని చిన్న వర్గాలపై పన్నుల భారం వేయడం న్యాయసమ్మతమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ఇండియాకు బలమైన భవిష్యత్తు కావాలంటే, వ్యవస్థలు కేవలం డేటా ఆధారంగా కాకుండా మానవీయంగా వ్యవహరించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : Dog Walker తో నెలకు రూ.4.5 లక్షలు సంపాదన! పెంపుడు కుక్కలే ఉపాధి