25 Apr 2025, Fri

Vangalapudi Anitha Biography వంగ‌ల‌పూడి అనిత బయోగ్రఫీ

Vangalapudi Anitha Biography

వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు. ఆమె 2014 మరియు 2024 శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం, 2024 జూన్ 12న ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

Vangalapudi Anitha Age, Date of Birth, Family

వంగలపూడి అనిత 1984 జనవరి 1న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా, ఎస్.రాయవరం మండలానికి చెందిన లింగరాజుపాలెం గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి పేరు వంగలపూడి అప్పారావు. 2009లో ఆంధ్రా యూనివర్సిటీ నుండి ఎమ్.ఏ మరియు ఎమ్.ఎడ్ చదువులు పూర్తి చేసిన అనంతరం, ఆమె ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా సేవలు అందించారు. అయితే, 28 సంవత్సరాల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, 2012లో రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.

పేరువంగ‌ల‌పూడి అనిత
జన్మతేది1984 జనవరి 1
జన్మస్థలంలింగరాజుపాలెం గ్రామం, ఎస్.రాయవరం మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
వయసు41
తండ్రివంగలపూడి అప్పారావు
జీవిత భాగస్వామి కొసరు శివ ప్రసాద్
సంతానం కొసరు నిఖిల్, కొసరు రేష్మిత శ్రీ
రాజకీయ పార్టీతెలుగుదేశం పార్టీ
విద్య ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎం.ఏ. ఎం.ఇడి పూర్తి చేసారు
వృత్తి   రాజకీయ నాయకురాలు
InstagramClick Here
TwitterClick Here
FacebookClick Here

Vangalapudi Anitha Political Career

వంగలపూడి అనిత 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2,828 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2018లో ఆమె తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు.

ఆమె 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుండి పోటీ చేసినా, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తానేటి వనిత చేతిలో 25,248 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2021 జనవరి 30న ఆమెను ఆంధ్రప్రదేశ్ తెలుగు మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించారు.

తాజాగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుండి మళ్లీ టీడీపీ తరఫున పోటీ చేసి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంబాల జోగులుపై 43,727 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అనంతరం 2024 జూన్ 12న ఆమెను హోంశాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రిగా నియమించడమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *