దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ ప్రభుత్వ శుభవార్త: ఉచితంగా రూ.50,000 సహాయం.. పూర్తి వివరాలు ఇవే!

తెలంగాణ ప్రభుత్వం మరోమారు మానవతా దృష్టికోణంతో దివ్యాంగులు మరియు ట్రాన్స్‌జెండర్లకు మంచి అవకాశం కల్పించింది. వీరి ఆర్థిక, సామాజిక స్థితిని బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉపాధి పునరావాస పథకాన్ని ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకం అమలులోకి రానుంది. దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా జీవనోపాధిని ఏర్పరుచుకునేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
పథకం ముఖ్యాంశాలు:
ఈ పథకం కింద లబ్ధిదారులకు బ్యాంక్ లింకేజీ అవసరం లేకుండా నేరుగా నిధులను అందజేయనున్నారు. సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి:
- 100% సబ్సిడీతో రూ.50,000 మంజూరు
- 80% సబ్సిడీతో రూ.1,00,000
- 70% సబ్సిడీతో రూ.2,00,000
- 60% సబ్సిడీతో రూ.3,00,000 వరకు సహాయం
ఈ అవకాశాన్ని పొందాలనుకునే దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లు 2025 జూలై 14 నుండి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కోసం అధికారిక వెబ్‌సైట్: https://tgobmms.cgg.gov.in
అర్హతలు ఈ విధంగా ఉన్నాయి:
- కనీసం 40 శాతం దివ్యాంగత తప్పనిసరి.
- వయసు 21 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి.
- గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ.1.5 లక్షల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి.
- గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి ప్రభుత్వ సబ్సిడీ పొందకూడదు.
అన్ని దరఖాస్తుల పరిశీలన తర్వాత జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ ద్వారా ఎంపిక జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 21 యూనిట్లను మంజూరు చేశారు.
ట్రాన్స్‌జెండర్లకు నైపుణ్య శిక్షణ:
నిరుద్యోగంగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో శిక్షణలు అందించనున్నారు:
- డ్రైవింగ్
- ఫోటోగ్రఫీ & వీడియో గ్రాఫీ
- బ్యూటీషియన్
- జ్యూట్ బ్యాగ్ తయారీ
- లాజిస్టిక్స్ & సప్లై చైన్ మేనేజ్‌మెంట్
ఈ శిక్షణ పూర్తైన తర్వాత ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు దరఖాస్తు తేదీ జూలై 23, 2025 వరకు మాత్రమే ఉంటుంది.
ఈ అవకాశాన్ని పొందాలనుకునే వారు తెలంగాణ రాష్ట్రానికి చెందాలని, సంబంధిత శిక్షణలో ఆసక్తి మరియు ప్రాథమిక అర్హతలు కలిగి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
Also Read : Tippa Teega: తిప్పతీగతో ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు – రోజూ 2 ఆకులు చాలు!