T Harish Rao Biography టీ హరీష్ రావు

T Harish Rao Biography టీ హరీష్ రావు

T Harish Rao : తన్నీరు హరీష్ రావు (జ. జూన్ 3, 1972) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆయన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి చెందిన సీనియర్ నేతగా, సిద్దిపేట శాసనసభ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రిగా పదవిని స్వీకరించి, అప్పటి నుండి ఈ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

2014 నుండి 2018 వరకు తెలంగాణ ప్రభుత్వం లో నీటిపారుదల, మార్కెటింగ్ మరియు శాసన వ్యవహారాల మంత్రిగా సేవలందించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో, భారతదేశంలో అత్యంత పిన్న వయసులోనే వరుసగా ఆరు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ఘనతను సాధించారు.

T Harish Rao Age, Date of Birth, Family

పేరుతన్నీరు హరీష్ రావు
జన్మతేది3 జూన్ 1972
జన్మస్థలంతోటిపెల్లి విలేజ్ , బెజ్జంకి మండల్ , కరీంనగర్ డిస్ట్రిక్ట్
వయసు52
తండ్రిసత్యనారాయణ
తల్లిలక్ష్మీబాబు
జీవిత భాగస్వామి శ్రీనితరావు
సంతానం ఒక కుమారుడు, ఒక కుమార్తె
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (BRS)
వృత్తి   రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త
Twitterhttps://x.com/BRSHarish
Facebookhttps://www.facebook.com/TrsHarish/
Instagramhttps://www.instagram.com/trsharish/

T Harish Rao Political Career

హరీష్ రావు 2004లో తొలిసారి సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో యువజన సేవలు, ప్రింటింగ్ మరియు స్టేషనరీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఒకేసారి సిద్దిపేట శాసనసభ, కరీంనగర్ పార్లమెంటు స్థానాలకు ఎన్నిక కావడంతో, సిద్దిపేట స్థానాన్ని ఆయన ఖాళీ చేయాల్సి వచ్చింది. ఆ ఉప ఎన్నికలో హరీష్ రావు విజయం సాధించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

అప్పటికే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన హరీష్ రావు, నేరుగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ప్రజలకు అంకితంగా పనిచేశారు. తన నాయకత్వంతో నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించి, విశేష కృషి చేశారు.

తెలంగాణ కోసం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24,827 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2008 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58,935 ఓట్ల మెజార్టీతో రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో 64,014 ఓట్ల తేడాతో గెలిచారు.

2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ప్రకటించిన ప్రకటనను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో, నిరసనగా 2010లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఓట్ల తేడాతో అత్యధిక మెజార్టీ సాధించి, 2009లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో సాధించిన 68,681 ఓట్ల రికార్డును తిరగరాశారు.

2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి పోటీ చేసి, 93,328 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ తర్వాత ఆయన నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 1,18,699 ఓట్ల భారీ మెజార్టీతో మరోసారి గెలుపొందారు. 2019 సెప్టెంబర్ 8న కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2021 నవంబర్ 9న ప్రభుత్వం ఆయనకు ఆరోగ్యశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించింది.

T Harish Rao Wife ,Son, Daughter Photos

T Harish Rao
T Harish Rao Wife ,Son, Daughter Photos

viratnagendar

Virat Nagender is a Digital Marketing Expert and the mind behind JanataPoll.com, delivering clear, engaging content on politics, governance, and public opinion to keep citizens informed.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *