PV Midhun Reddy Biography పి వి మిధున్ రెడ్డి బయోగ్రఫీ

PV Midhun Reddy Biography : పి.వి. మిధున్ రెడ్డి ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు మరియు లోక్‌సభ సభ్యుడు. చిత్తూరు జిల్లా రాజకీయ వర్గానికి చెందిన ఆయన, రాజకీయ వారసత్వం కలిగిన కుటుంబంలో జన్మించారు. 2014 లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం నుంచి విజయవంతంగా ఎంపీగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీ నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చూపిందని అభిప్రాయంతో, ప్రధాని నరేంద్ర మోదీపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్థావించిన మొదటి పార్టీగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నిలిచింది. ఈ నేపథ్యంలో, మిధున్ రెడ్డి ఇతర ఎంపీలతో కలిసి తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
తర్వాత 2019 జూన్ 5న, మిధున్ రెడ్డి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ పార్లమెంటరీ నాయకుడిగా నియమితులయ్యారు. ఆయన తెలివితేటలతో కూడిన నాయకత్వం పార్టీకి నూతన దిశనిచ్చింది.
PV Midhun Reddy Age, Date of Birth, Family
పేరు | పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి |
జన్మతేది | 5 April 1984 |
వయసు | 41 |
జన్మస్థలం | పుంగనూరు, చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
తల్లిదండ్రులు | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , స్వర్ణలత |
జీవిత భాగస్వామి | లక్ష్మీ దివ్య |
సంతానం | 1 |
రాజకీయ పార్టీ | వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ |
విద్య | B.E. (Mechanical), MBA (International Business) Educated at Madras University and Schiller International University, London |
వృత్తి | రాజకీయ నాయకుడు |
Click Here | |
Click Here | |
Click Here |
PV Midhun Reddy ఎన్నికల విజయయాత్ర:
పి.వి. మిధున్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు కీలక విజయాలను నమోదు చేసుకున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన, అప్పటి బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి మరియు ఎన్టీఆర్ కుమార్తె అయిన దగ్గుబాటి పురంధేశ్వరి పై ఘన విజయం సాధించారు.
తర్వాత 2019 లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీచేసిన మిథున్ రెడ్డి, ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి.కె. సత్యప్రభ పై భారీగా 2,68,284 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం ఆయనకు రాజకీయంగా మరింత బలం చేకూర్చింది.
పెద్దిరెడ్డి కుటుంబ నేపథ్యం:
మిథున్ రెడ్డి రాజకీయ జీవితానికి మద్దతుగా ఉన్న మరో అంశం ఆయన కుటుంబ నేపథ్యం. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆయన పుంగనూరు శాసనసభ్యులుగా కొనసాగుతూ, వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ & జియాలజీ శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ ప్రకారం, మిథున్ రెడ్డి ఆస్తి విలువ ₹66.51 కోట్లు.
వివాదాలు & అరెస్టు ఘటన:
మిథున్ రెడ్డి పేరు వినిపించిన మరొక సంచలన ఘటన తిరుపతి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. బోర్డింగ్ పాస్ జారీ విషయంలో చోటుచేసుకున్న వాగ్వాదం చివరికి ఎయిర్ ఇండియా మేనేజర్ రాజశేఖర్ పై బౌతిక దాడిగా మారింది. ఈ ఘటన తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలకు గురైంది.
ఈ దాడిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరియు ఇతర కార్యకర్తలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. పోలీస్ వ్యవహారంలో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరుకాకపోవడంతో, ఆయనను శ్రీకాళహస్తి అదనపు న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. ఈ కేసులో శ్రీకాళహస్తి ఇంచార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా అరెస్టయ్యారు.
Also Read : Mynampally Rohit Biography మైనంపల్లి రోహిత్ బయోగ్రఫీ
One thought on “PV Midhun Reddy Biography పి వి మిధున్ రెడ్డి బయోగ్రఫీ”