Nilam Madhu Mudhiraj Mumbai Siddhi Vinayak : ముంబై సిద్ధి వినాయకుడిని దర్శించుకున్న నీలం మధు ముదిరాజ్
నీలం మధు ముదిరాజ్ తన జన్మదినాన్ని (Nilam Madhu Mudhiraj Birthday)పురస్కరించుకుని, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు ముదిరాజ్, ముంబైలోని ప్రసిద్ధ పవిత్ర స్థలమైన సిద్ధి వినాయక దేవాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, అనంతరం మాట్లాడుతూ ముంబైలోని సిద్ధి వినాయక ఆలయం దేశవ్యాప్తంగా విశేష ప్రాముఖ్యత కలిగిన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నిలిచిందని అన్నారు. తమ కోరికలను తీర్చుకునేందుకు భక్తులు ఈ ఆలయాన్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందుతున్నారని తెలియజేశారు.
సాధారణంగా వినాయకుడి విగ్రహాలలో తొండం ఎడమ వైపు ఉండే విభిన్నత ఉంది, కానీ ఈ ఆలయంలో వినాయకుని తొండం కుడివైపుగా ఉండటమే కాకుండా, తొండంలో మూడో కన్ను కూడా ఉన్నదని తెలిపారు. ఈ ప్రత్యేకతల కారణంగా సిద్ధి వినాయకుడిని దర్శించుకోవడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయని నీలం మధు వివరించారు.

స్వామివారి కృపను పొందడం తనకు అనాదిగా అలవాటు అని, అందులో భాగంగా తన జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్ధి వినాయకుడిని దర్శించుకున్నట్లు చెప్పారు. సిద్ధి వినాయకుని ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.